‘పొన్నియిన్ సెల్వన్-1లో' నటించిన ఐశ్వర్య లక్ష్మి మరో మూవీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'అమ్ము'. ఈ సినిమా ఓటీటీలో ప్రీమియర్ షోగా అక్టోబర్ 19న అలరించేందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కార్తీక్ సుబ్బరాజ్,నవీన్ చంద్ర, నిహారిక కొణిదెల, దేవాకట్టా,శరత్ మరార్,రాజ్ కందుకూరి, స్వాతి హాజరయ్యారు.
నేరుగా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తున్న తొలి తెలుగు మూవీ "అమ్ము". ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరకెక్కించారు. ఈ థ్రిల్లింగ్ స్టోరీ ఓటీటీలో సందడి చేయనుంది. అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించగా.. ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఈ చిత్రానికి చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ‍్యవహరించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ డ్రామా థ్రిల్లర్‌లో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, సింహా నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను అలరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment