ఐశ్వర్యరాజేశ్‌ హౌస్‌ఓనర్‌ అవుతుందా? | Ashok Selvan, Aishwarya Rai new movie is Houseowner | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యరాజేశ్‌ హౌస్‌ఓనర్‌ అవుతుందా?

Published Thu, Jul 20 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

ఐశ్వర్యరాజేశ్‌ హౌస్‌ఓనర్‌ అవుతుందా?

ఐశ్వర్యరాజేశ్‌ హౌస్‌ఓనర్‌ అవుతుందా?

తమిళసినిమా:  నటి ఐశ్వర్య రాజేశ్‌ హౌస్‌ఓనర్‌ కావాలనే కల నెరవేరుతుందా? ఏమిటీ అసలు విషయం ఏమిటో చెప్పకుండా హౌస్‌ఓనర్‌ అదీ, ఇదీ అంటున్నారు అని అనుకుంటున్నారా? ఇవా ళ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చాలా మంది కలిగేది సొంత ఇల్లు కలే. అలాంటి ఒక యువ దంపతుల డ్రీమే హౌస్‌ఓనర్‌.

ఈ టిటైల్‌తో మహిళా దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్‌ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు  చేస్తున్నారు. ఇందులో అశోక్‌ సెల్వన్‌ హీరోగానూ, నటి ఐశ్వర్యరాజేశ్‌ హీరోయిన్‌గానూ నటించనున్నారు. దీని గురించి దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్‌ తెలుపుతూ అమ్మణి చిత్రం తరువాత తన తాజా చిత్రానికి గత ఏడాది తమిళ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన తుపాన్‌ నేపథ్యంలో ఒక చిత్రం చేయాలని భావించానన్నారు. అయితే అ దే సమయంలో తన కూతురు వివాహ నిశ్చి తార్థం జరగడంతో తన పెళ్లి తరువాత ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నానన్నారు.

కాగా ఇటీవల ముంబయి వెళ్లినప్పుడు ఒక హిం దీ చిత్రాన్ని చూశానని తెలిపారు.ఆ చి త్రం తన ను చాలా ఆకట్టుకుందని, దాంతో ఆ చిత్ర నిర్మాతను కలిసి హక్కుల కోసం చర్చించినా, అది సెట్‌ కాలేదన్నారు.అయితే ఆ చిత్ర కథ మాత్రం తన మనసులోంచి పోలేదన్నారు.దీంతో ఆ చిత్ర స్ఫూర్తితో తానే ఒక కథను రెడీ చేసుకున్నానని చెప్పారు. ఒక యువ దంపతుల సొంత ఇల్లు కల ఇతి వృత్తంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హౌస్‌ఓనర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించి నట్లు తెలిపారు.చిత్ర షూటింగ్‌ ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement