ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్‌.. భార్య ఎలా ఫీలైందో చెప్పిన హీరో | Ashok Selvan Interesting Comments on Saba nayagan Movie Press Meet | Sakshi
Sakshi News home page

Ashok Selvan: ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టిన హీరో

Nov 28 2023 8:36 AM | Updated on Nov 28 2023 10:12 AM

Ashok Selvan Interesting Comments on Saba nayagan Movie Press Meet - Sakshi

ఈ రెండు విషయాలు ఈ చిత్రంలో తనకు కొత్తగా అనిపించిందన్నారు. దర్శకులు ఇలాంటి కొత్త అవకాశాలను కల్పించినప్పుడే తమలాంటి నటులు వాటిని సద్వినియోగం చేసుకుం

నటుడు అశోక్‌ సెల్వన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సభానాయగన్‌. ఇందులో నటి మేఘా ఆకాష్‌, కార్తీక మురళీధరన్‌, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీఎస్‌ కార్తికేయన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని క్లియర్‌ వాటర్‌ పిక్చర్స్‌ అధినేత అరవింద్‌ జయబాలన్‌, జీ సినిమా అధినేత అయ్యప్పన్‌ జ్ఞానవేల్‌, కెప్టెన్‌ మెగా ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత కెప్టెన్‌ మేఘవానన్‌ కలిసి నిర్మించారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతాన్ని, బాలసుబ్రహ్మణ్యం శిష్యుడు దినేశ్‌ పురుషోత్తమన్‌, ప్రభు రాఘవ్‌ కలిసి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్‌ 15వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ సందర్భంగా ఆదివారం చైన్నెలో చిత్ర యూనిట్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు అశోక్‌ సెల్వన్‌ మాట్లాడుతూ సభానాయగన్‌ జాలీగా సాగే క్లీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కామెడీ, డాన్స్‌ కోసం తాను చాలా రిహార్సల్స్‌ చేసినట్లు చెప్పారు. ఈ రెండు విషయాలు ఈ చిత్రంలో తనకు కొత్తగా అనిపించిందన్నారు. దర్శకులు ఇలాంటి కొత్త అవకాశాలను కల్పించినప్పుడే తమలాంటి నటులు వాటిని సద్వినియోగం చేసుకుంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో సన్నిహితంగా నటించడం గురించి అడుగుతున్నారని, అయితే అలా నటించడాన్ని తన భార్య కీర్తి ఏమాత్రం తప్పుగా భావించరని పేర్కొన్నారు. తొలిప్రేమ, పాఠశాల, జీవితం వంటివి మరిచిపోలేని అనుభవాలని అవి, మనసులోంచి తొలగించలేనివని అన్నారు. అలాంటి వాటిని మళ్లీ గుర్తు చేసే చిత్రంగా సభానాయగన్‌ ఉంటుందన్నారు. అంతే కాకుండా మీ మానసిక వేదనలకు ఒక మంచి వైద్యంగా ఈ చిత్రం ఉంటుందన్నారు.

చదవండి: ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఆయనకు పెద్ద ఫ్యాన్‌ను: మహేశ్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement