Chandini Chowdary Got Tamil Movie Offer With Ashok Selvan, Deets Inside - Sakshi
Sakshi News home page

Chandini Chowdary: కోలీవుడ్‌ హీరోతో రొమాన్స్‌కి రెడీ అంటున్న చాందిని చౌదరి!

Published Tue, Jul 26 2022 9:23 PM | Last Updated on Wed, Jul 27 2022 9:14 AM

Chandini Chowdary Gets Offer In Tamil Movie With Ashok Selvan - Sakshi

చాందిని చౌదరి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మన తెలుగమ్మాయి అయిన చాందిని మధురం వంటి షార్ట్‌ ఫిలింస్‌తో కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లో సహానటి పాత్రలు పోషిస్తూ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల ఆమె సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె నటించిన కలర్‌ ఫొటో ఉత్తమ ప్రాంతియ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎన్నికైన విషయం తెలిసిందే.

చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌.. నీళ్లు నమిలిన విజయ్‌

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. త్వరలోనే ఆమె కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘ఓ మై కడవులే’, ‘మన్మథ లీలై’ చిత్రాల హీరో అశోక్‌ సెల్వన్‌ సరసన నటించే చాన్స్‌ అందుకుంది. ఈ మూవీతో కమల్‌ హాసన్‌ శిష్యుడు సి.ఎస్‌ కార్తికెయన్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కమల్‌ తెరకెక్కించిన విశ్వరూపం సీక్వెల్స్‌లోకు కార్తీకేయన్‌ దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇప్పుడ స్వయంగా ఈ సినిమాను రూపొందించబోతున్నాడు.

చదవండి: నయన్‌ను కించపరిచిన ప్రముఖ నిర్మాత.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్‌

ఈ సందర్భంగా కార్తికేయన్‌ మాట్లాడుతూ.. ‘స్కూల్‌, కాలేజీ, పోస్ట్‌ కాలేజీకి సంబంధించిన కథ. ఓ యువకుడి జీవితంలోకి మూడు ఫేజెస్‌లో ముగ్గురు అమ్మాయిలు వస్తారు. రొమాంటిక్‌, కామెడీ నేపథ్యంలోనే మూవీ సాగనుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో తాను కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది చాందిని. కాగా అశోక్‌ సెల్వెన్‌ తెలుగులో ‘నువ్విలా నువ్విలా’ చిత​ంరలో నటించగా.. అశోక వనంలో అర్జున కళ్యాణంలో అతిథి పాత్రలో కనిపించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement