
బిందు టైమ్ బాగుంది
జయాపజాయాలే హీరోహీరోయిన్ల మార్కెట్‌ను డిసైడ్ చేస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరి విషయంలో నటనలో ప్రతిభ ఉన్నా అదృష్టం దోబూచులాడుతూ ఉంటుంది.
జయాపజాయాలే హీరోహీరోయిన్ల మార్కెట్‌ను డిసైడ్ చేస్తాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరి విషయంలో నటనలో ప్రతిభ ఉన్నా అదృష్టం దోబూచులాడుతూ ఉంటుంది. ఈ కోవలోకి నటి బిందు మాధవి వస్తుం ది. ఈ తెలుగింటి భామ కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినా ప్రస్తుతం తమిళ చిత్రాలపైనే దృష్టిసారించింది. తొలి రోజుల్లో విజయం ముఖం చాటేసినా ఆ తర్వాత కేడీబిల్లా కిల్లాడి రంగా, దేసింగురాజా వంటి చిత్రాలతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఈ బ్యూటీకి ఎందుకో రావలసినంత పేరు రాలేదు.
అలాగే స్టార్స్‌తో రొమాన్స్ చేసే అవకాశాలు తలుపుతట్టలేదు. ఇటీవల అరుళ్‌నిధి సరసన నటించిన ఒరు కన్నియుం మూండ్రు కలవాణిగలుమ్ చిత్రం బిందుమాధవి కెరీర్‌కు ఏ మాత్రం హెల్ప్‌కాలేదు. ఇప్పుడీ బ్యూటీ టైమ్ తిరిగిందనిపిస్తోంది. తాజాగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలొచ్చాయి. వీటిలో ఒకటి సక్సెస్‌ఫుల్ యువ నటుడు విజయ్ సేతుపతితో రొమాన్స్ చేసే అవకాశం. మరొకటి తెగిడి ఫేమ్ అశోక్ సెల్వన్ సరసన నటించే అవకాశం. విజయ్ సేతుపతి సరసన నటించే చిత్రానికి వసంత కుమారన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నగర నేపథ్యంలో సాగే ఈ రొమాంటింక్ లవ్ స్టోరీ చిత్రానికి నవ దర్శకుడు ఆనంద్ కుమరేశన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో బిందుమాధవి చెన్నై చిన్నదిగా మోడ్రన్ పాత్రలో నటించనుంది. ఈ చిత్రం జూలైలో ప్రారంభంకానుంది. ఇకపోతే అశోక్ సెల్వన్‌కు జంటగా నటించనున్న చిత్రాన్ని నటుడు అరుణ్ పాండియన్ కూతురు నిర్మించనున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం సిటీ తరహా కథతో తెరకెక్కనుంది. ప్రస్తుతం బిందుమాధవి తమిళుక్కు తనయై అళుక్కవుం అనే చిత్రంలో నటిస్తోంది. మొత్తం మూడు చిత్రాలతో ఈ బ్యూటీ మళ్లీ ఫామ్‌లోకి వస్తోందన్నమాట.