సాక్షి, చెన్నై: హాస్టల్ చిత్ర అవకాశాన్ని తొలుత అంగీకరించ వద్దనుకున్నానని నటుడు అశోక్ సెల్వన్ అన్నారు. ఈయన నటి ప్రియ భవాని శంకర్‌తో కలిసి నటించిన చిత్రం హాస్టల్. టైడెంట్ ఆర్ట్స్ పతాకంపై రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి సుమంత్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు అశోక్ సెల్వన్ మాట్లాడుతూ మలయాళ చిత్రానికి రీమేక్ అయినా ఈ చిత్ర అవకాశాన్ని తిరస్కరించాలని మొదట్లో అనుకున్నానన్నారు. అయితే టైడెంట్ ఆర్ట్స్ వంటి పెద్ద సంస్థ నిర్మించడంతో నటించానికి అంగీకరించానన్నారు. మలయాళ చిత్రాన్ని దర్శకుడు తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారని, చక్కని వినోద భరిత చిత్రంగా ఇది ఉంటుందని అశోక్ సెల్వన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment