శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్‌తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్‌ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.
అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్‌కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తన వెబ్‌సైట్‌ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు.
కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment