కోలీవుడ్‌ ఎంట్రీ? | Janhvi Kapoor Ready to Kollywood Entry | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ ఎంట్రీ?

Published Fri, Feb 14 2025 2:17 AM | Last Updated on Fri, Feb 14 2025 2:17 AM

Janhvi Kapoor Ready to Kollywood Entry

కోలీవుడ్‌(Kollywood)లో జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) ఎంట్రీ గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ జాన్వీ ఇప్పటివరకు తమిళంలో ఒక్క ప్రాజెక్ట్‌ కూడా చేయలేదు. అయితే ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందని, ఓ తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు జాన్వీ కపూర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని కోలీవుడ్‌ సమాచారం.

తమిళంలో ‘కబాలి, తంగలాన్‌’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు పా. రంజిత్‌ ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లోనే జాన్వీ లీడ్‌ రోల్‌ చేయనున్నారట. తమిళ దర్శకుడు ఏ. సర్గుణం ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

సాధారణంగా పా. రంజిత్‌ డైరెక్షన్‌లోని సినిమాలైనా, నిర్మించే సినిమాల్లోనైనా, సమకాలీన అంశాల ప్రస్తావన ఉంటుంది. సో... జాన్వీతో రంజిత్‌ ఎలాంటి సబ్జెక్ట్‌ను డీల్‌ చేయనున్నారన్న టాపిక్‌ చర్చనీయాంశమైంది. ఇక ఈ సిరీస్‌లో జాన్వీ కపూర్‌ నటించనున్నారనే విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement