జాన్వీకపూర్‌ కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం డ్రాప్‌? | Janhvi Kapoor Ready to Kollywood Entry? | Sakshi
Sakshi News home page

జాన్వీకపూర్‌ కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం డ్రాప్‌?

Published Sun, Jun 30 2024 11:36 AM | Last Updated on Sun, Jun 30 2024 11:36 AM

Janhvi Kapoor Ready to Kollywood Entry?

అనుకున్నవన్నీ జరగవు. జరిగేవాటిని ఊహించలేము. ఇదే జీవితం. నటి జాన్వీ కపూర్ విషయంలోనూ ఇదే జరిగిందని సమాచారం. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి వారుసురాలు జాన్వీ కపూర్ అన్నది తెలిసిందే. ఈమె తండ్రి బోనీ కపూర్‌ హిందీలో పాటు కొన్ని తమిళ చిత్రాలు నిర్మించారు. ఈ మధ్య అజిత్‌ కథానాయకుడిగా తుణివు వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. కాగా బాలీవుడ్‌లో నటిగా పరిచయమై రాణిస్తున్న జాన్వీకపూర్‌కు తన తల్లి మాదిరిగానే  దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటించి పేరు తెచ్చుకోవాలన్నది ఆశ. 

ఈ విషయాన్ని ఆమె పలుసార్లు ఆమె స్వయంగా వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. జూనియర్‌ ఎనీ్టఆర్‌ సరసన దేవర అనే భారీ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. త్వరలో రామ్‌చరణ్‌తో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో కూడా నటించాలని జానీ్వకపూర్‌ చాలా ఆశగా ఉన్నారు. అలా ఒక పాన్‌ ఇండియా సినిమాలో నటించడానికి కమిట్‌ అయ్యారు. హిందీ, తెలుగు, తమిళం భాషల్లో రూపొందనుందనని పేర్కొన్నారు. కాగా మహాభారతం ఇతివృత్తంతో సాగే ఈ చిత్రానికి కర్ణ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 

ఇందులో కర్ణుడిగా నటుడు సూర్య నటించనున్నారని, ఆయనకు జంటగా నటి జానీ్వకపూర్‌ ఎంపికైనట్టు ప్రచారం జోరుగా సాగింది. త్వరలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఏమైందో గానీ ఇప్పుడీ చిత్రం డ్రాప్‌ అయినట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అలాగే జానీ్వకపూర్‌ కోలీవుడ్‌ ఎంట్రీ చిత్రం ఆగిపోవడం ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అవుతుంది. అయితే తాజాగా విజయ్‌తో ఆయన 69వ చిత్రంలో జానీ్వకపూర్‌ నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం అయినా నిజం అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement