అరేంజ్‌ మ్యారేజ్‌ నాకు సెట్‌ కాదు : నటుడు | Actor Ashok Selvan Open Comments About Marraige At Chennai | Sakshi
Sakshi News home page

Ashok Selvan : పెద్దలు నిశ్చయించిన పెళ్లి నాకు సెట్‌ కాదు.. నటుడి ఓపెన్‌ కామెంట్స్‌

Published Sat, Nov 12 2022 8:56 AM | Last Updated on Sat, Nov 12 2022 9:03 AM

Actor Ashok Selvan Open Comments About Marraige At Chennai - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదుగుతున్న నటుడు అశోక్‌ సెల్వన్‌. ఓ మై కడవులే వంటి హిట్‌ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన త్వరలో తెలుగు చిత్ర, పరిశ్రమలోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాగా తాజాగా ఈయన నాలుగు పాత్రల్లో నటించిన చిత్రం నిత్తం ఒరువానం. నటి రీతువర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రాన్ని ఆర్‌.కార్తీక్‌ దర్శకత్వంలో వైకామ్‌ 18 స్టూడియోస్, ఈస్ట్‌ రైజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గత 4వ తేదీన విడుదలై మంచి ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది.

ఈ సందర్భంగా నటుడు అశోక్‌ సెల్వన్‌ గురువారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ నిత్తం ఒరువానం తన ఫేవరెట్‌ చిత్రం అన్నారు. ఇందులో భిన్నమైన నాలుగు పాత్రలు పోషించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. కాగా ఇందులో ముగ్గురు హీరోయిన్లతో నటించడం గురించి అడుగుతున్నారని చెప్పారు. చిత్రంలో కథానాయికల ఎంపిక అన్నది దర్శకుడిదేనన్నారు. అలాగే తనతో కలిసి నటించిన హీరోయిన్లలో నచ్చిన నటి ఎవరిని అడిగితే ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన టాలెంట్‌ ఉంటుందన్నారు. అదే విధంగా మంచీ చెడూ ఉంటాయన్నారు. తనకు అందరూ నచ్చిన వారేనని చెప్పారు.

పెళ్లెప్పుడన్న ప్రశ్నకు కెరీర్‌ పరంగా ఎదుగుతున్న సమయం ఇదనీ, తాను సినీ నేపథ్యం నుంచి గానీ, ఉన్నత కుటుంబం నుంచి గానీ రాలేదన్నారు. శ్రమించి స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఆసమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని అన్నారు. ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, అయితే తన మనస్తత్వానికి పెద్దలు నిశ్చయించిన పెళ్లి సెట్‌ కాదని చెప్పారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మన్మధలీల చిత్రంలో నటించిన వినూత్న అనుభవంగా పేర్కొన్నారు. మంచి హ్యూమరస్‌ కథాంశంతో రూపొందిన ఆ చిత్రం ప్రేక్షకుల్లోకి వేరే మాదిరిగా వెళ్లిందన్నారు. అన్ని రకాల పాత్రలో నటించాలని ఆశిస్తున్నానని, ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో శరత్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న యాక్షన్, థ్రిల్లర్‌ కథా చిత్రం తదుపరి విడుదల కానుందనీ చెప్పారు. భవిష్యత్తులో మెగాఫోన్‌ పట్టే అవకాశం ఉందని అశోక్‌ సెల్వన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement