Keerthy Suresh: టీకా తీసుకున్న ‘మహానటి’.. ఫోటో వైరల్‌ | Keerthy Suresh And Ashok Selvan Get First Dose Of Covid Vaccine | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: టీకా తీసుకున్న ‘మహానటి’.. ఫోటో వైరల్‌

Published Sun, May 23 2021 1:47 PM | Last Updated on Sun, May 23 2021 2:11 PM

Keerthy Suresh And Ashok Selvan Get First Dose Of Covid Vaccine - Sakshi

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు.

 తాజాగా ఈ జాబితాలో హీరోయిన్‌ కీర్తి సురేష్, హీరో అశోక్ సెల్వన్ చేరారు. వీరిద్దరు చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోకరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.  ఈ ఫోటోని కీర్తి సురేష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరింది.

అలాగే అశోక్ సెల్వన్ కోవిడ్ -19 టీకాను మే 22న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకున్నారు. తనకు చాలా సందేహాలు ఉన్నాయని, అయితే డాక్టర్లు, నిపుణులతో మాట్లాడి ఆ సందేహాలను నివృత్తి చేసుకున్నాను అని, ఆ తరువాత టీకా తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement