పిజ్జాని మరపించే విల్లా
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతోన్న చిత్రం విల్లా (పిజ్జా-2). అశోక్ సెల్వన్, సంచిత శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దీపన్.ఆర్ దర్శకుడు. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సంతోష్ నారాయణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మారుతి ఆడియో సీడీని ఆవిష్కరించి డీవీవీ దానయ్య, పరుచూరి ప్రసాద్‌లకు అందించారు. ‘‘నా ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ‘పిజ్జా’ చిత్రమే స్ఫూర్తి.
ఈ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని మారుతి అన్నారు. ‘పిజ్జా’కు కొనసాగింపు అనగానే... ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయని, థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం నిరుత్సాహానికి లోను చేయదని దర్శకుడు చెప్పారు. ‘పిజ్జా’ను మించిన థ్రిల్‌ని ఈ సినిమా కలిగిస్తుందని అశోక్ సెల్వన్ అన్నారు. ఇంకా బెల్లంకొండ సురేష్, మల్టీ డైమన్షన్ వాసు, మల్లిడి సత్యనారాయణరెడ్డి, పి.వి.పి.రాజీవ్, ఎస్.ఎన్.రెడ్డి, వంశీ మహేందర్, ఎస్.కె.ఎన్, శ్రేయాస్ శ్రీను, తమిళ వెర్షన్ నిర్మాత సి.వి.కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.