Sanchitha Shetty
-
సూపర్‌స్టార్ టైటిల్‌తో ప్రశాంత్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం టైటిల్‌తో చాలా ఫ్రెష్‌గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్ స్టార్ ప్రశాంత్. గతంలో రజనీకాంత్ నటించిన చిత్రం జానీ విజయాన్ని సాధించింది. అదే టైటిల్‌తో ప్రశాంత్ నటిస్తున్న చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. స్టార్ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. నటి సంచితాశెట్టి కథానాయకిగా నటిస్తున్న ఇందులో ప్రముఖ నటుడు ప్రభు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఆనంద్‌రాజ్, అషుతోష్రాణా, శాయాజీ షిండే, దేవదర్శిని, కళైరాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వెట్ట్రిసెల్వన్ పరిచయం అవుతున్నారు. షూటింగ్ పార్టు పూర్తి చేసుకున్న జానీ చిత్ర వివరాలను తెలియజేయడానికి సోమవారం చిత్ర యూనిట్ స్థానిక సేట్పేట్లోని మలయాళీ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో ప్రశాంత్ మాట్లాడుతూ జానీ చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు. రజనీకాంత్ చిత్రంతో కంపేర్ చేస్తారు: నిర్మాత త్యాగరాజన్ మాట్లాడుతూ జానీ చిత్రం హర్రర్‌తో కూడిన భారీ సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రభు పాత్ర జానీ చిత్రంలో శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ జానీ చిత్రంతో పోల్చుకుంటారని, అంత స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అదరహో అనే స్థాయిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబరులో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పిజ్జాని మరపించే విల్లా
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతోన్న చిత్రం విల్లా (పిజ్జా-2). అశోక్ సెల్వన్, సంచిత శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దీపన్.ఆర్ దర్శకుడు. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. సంతోష్ నారాయణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మారుతి ఆడియో సీడీని ఆవిష్కరించి డీవీవీ దానయ్య, పరుచూరి ప్రసాద్‌లకు అందించారు. ‘‘నా ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ‘పిజ్జా’ చిత్రమే స్ఫూర్తి. ఈ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని మారుతి అన్నారు. ‘పిజ్జా’కు కొనసాగింపు అనగానే... ఈ సినిమాపై అంచనాలు అధికమయ్యాయని, థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను ఈ సినిమా ఏ మాత్రం నిరుత్సాహానికి లోను చేయదని దర్శకుడు చెప్పారు. ‘పిజ్జా’ను మించిన థ్రిల్‌ని ఈ సినిమా కలిగిస్తుందని అశోక్ సెల్వన్ అన్నారు. ఇంకా బెల్లంకొండ సురేష్, మల్టీ డైమన్షన్ వాసు, మల్లిడి సత్యనారాయణరెడ్డి, పి.వి.పి.రాజీవ్, ఎస్.ఎన్.రెడ్డి, వంశీ మహేందర్, ఎస్.కె.ఎన్, శ్రేయాస్ శ్రీను, తమిళ వెర్షన్ నిర్మాత సి.వి.కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.