Actor Ashok Selvan Wedding Actress Keerthi Pandian - Sakshi
Sakshi News home page

Ashok Selvan: మొన్నే హిట్ కొట్టాడు.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు!

Published Sun, Aug 13 2023 11:12 AM | Last Updated on Sun, Aug 13 2023 12:20 PM

Actor Ashok Selvan Wedding Actress Keerthi Pandian  - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరబోతుంది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న ఈ ఇద్దరూ.. త్వరలో రియల్ లైఫ్‌లో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

తమిళ హీరో అశోక్ సెల్వన్ గురించి తెలుగు ప్రేక్షకులు కొంతమందికి తెలుసు. 'పిజ్జా 2', 'భద్రమ్' లాంటి డబ్బింగ్ సినిమాలతో చాన్నాళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల్ని ఇతడు పలకరించాడు. కానీ పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయారు. అయితే 2020లో వచ్చిన 'ఓ మై కడవులే' హిట్ కావడం ఇతడికి చాలా ప్లస్ అయింది. దీని తర్వాత వరసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

(ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్‌.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!)

అలానే గతేడాది ఏకంగా 5 సినిమాల్లో హీరోగా నటించాడు. ఓ రెండు చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. ఇకపోతే మొన్నీ మధ్య 'పోర్ తొళిల్' అనే థ్రిల్లర్‌తో సూపర్‌హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'బ్లూ స్టార్' మూవీలో చేస్తున్న అశోక్ సెల్వన్.. ఇందులో తనతోపాటు నటిస్తున్న కీర్తి పాండియన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడట. సెప్టెంబరు 13న కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్లిద్దరూ ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ విషయం రూమర్ అయినప్పటికీ.. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉండగా కీర్తి పాండియన్ ప్రస్తుతం హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. 'తుంబా', 'అన్బిర్కినియాల్' ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారిపోయింది. 

(ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement