టెక్ మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ పై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇక 128 జీబీ మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ రూ. 71,999 ఉండగా.. 256 జీబీ మోడల్ ఖరీదు రూ.75,999 ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
దీంతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ఫోన్ కొనుగులు చేసిన స్మార్ట్ వినియోగదారులకి రూ. 15,990 విలువ గల గెలాక్సీ బడ్స్ ప్రో, రూ. 990 వోచర్ ను సొంతం చేసుకోవచ్చు.గెలాక్సీ 21 ప్లస్ ఆల్ట్రా, గెలాక్సీ ఎస్ 21ప్లస్, గెలాక్సీ 21 ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.10వేల శాంసంగ్ షాప్ వోచర్ ను పొందవచ్చు. గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా లేదా గెలాక్సీ ఎస్ 21 ను కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారుల కోసం శాంసంగ్ రూ.10వేలు, రూ.5,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్‌ను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే వరుసగా రూ. 10,000, రూ. 5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం ఉందని శాంసంగ్ తన అధికారిక నోట్ లో పేర్కొంది. అన్ని ఆఫర్‌లు తక్షణమే లభిస్తాయని జూన్ 30, 2021 వరకు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ప్లస్ ఫీచర్స్
గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 6.7-అంగుళాల ఫ్లాట్, ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేతో అమోలేడ్ ప్యానెల్ మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీతో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 12MP + 12MP + 64MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4,800 ఎంఏహెచ్ బ్యాటరీపై నడుస్తుంది.
చదవండి : 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లతో అదరగొడుతున్నాయ్
Comments
Please login to add a commentAdd a comment