సాక్షి,వెబ్‌డెస్క్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ దిగ్గజం శాంసంగ్ త్వరలో లాంచ్ చేసే కొత్త ఫోన్ గెలాక్సీ ఎం32 స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెలలో భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు లీకైన గెలాక్సీ ఎం 32కి ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
గెలాక్సీ ఎం 32 ధర
ప్రముఖ మీడియా ఐఏఎన్ ఎస్ నివేదిక ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎం 32 జూన్ నాలుగో వారంలో ఇండియాలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రారంభం ధర రూ.15వేల నుంచి రూ.20వేల మధ్యలో ఉండనుంది.
గెలాక్సీ ఎం 32 ఏఏ కలర్స్ లో ఉండబోతుంది
గెలాక్సీ ఎం 32 ఫోన్ ఇమేజెస్ ఇప్పటికే శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ లో బ్యాక్ ప్యానెల్,స్వైర్ షేప్ కెమోరా మాడ్యుల్, ఇన్ఫినిటీ-యు కటౌట్‌తో డిజైన్లను పోస్ట్ చేసి ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్స్ తో మార్కెట్ లో విడుదల కానుంది.
గెలాక్సీ ఎం 32 ఫీచర్స్
గెలాక్సీ ఎం 32 లో ఇన్ఫినిటీ-యు డిజైన్ తో 6.4-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్ పనిచేస్తుంది. 4GB RAM + 64GB మరియు 6GB RAM + 128GB ఇంట్రర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది.
గెలాక్సీ ఎం 32 కెమెరా
గెలాక్సీ ఎం 32 క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ తో వస్తుంది. చదవండి: Amazon Mobile Saving Days : ఈ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్స్
గెలాక్సీ ఎం 32 బ్యాటరీ
గెలాక్సీ ఎం 32 కూడా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ యుఐ లేయర్‌తో ఆండ్రాయిడ్ 11 పైన రన్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 1 టీబీ వరకు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment