
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ గెలాక్సీ సిరీస్‌లో తాజాగా ‘ఏ10ఎస్’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేసింది. గెలాక్సీ ఏ లైన్ స్మార్ట్‌ఫోన్‌కు అధునాతన ఎడిషన్‌గా వచ్చిన ఈ ఫోన్ ధరల శ్రేణి రూ. 9,499 నుంచి రూ. 10,499గా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియంట్లలో ఈ మోడల్ లభ్యంకానుంది. 2జీబీ, 3జీబీ ర్యామ్‌తో.. ఆగస్టు 28 నుంచి రిటైల్ స్టోర్స్, శాంసంగ్ ఒపెరా హౌస్, ఆన్‌లైన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుందని సంస్థ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ప్రకటించారు. 6.2–అంగుళాల స్క్రీన్, వెనుకవైపు డ్యుయల్ కెమెరా (13 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 ఎంపీ సెకండరీ), 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకలు ఉంటాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment