
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధర రూ.57,900. కాగా కంపెనీ తొలిసారిగా ఈ ప్రీమియం ప్రొడక్టులను ఇటీవల స్పెయిల్‌లోని బార్సిలోనాలో ఆవిష్కరించింది. డ్యూయెల్ ఎపర్చర్ అండ్ స్లో మోషన్ వీడియో ఆప్షన్స్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, డాల్బే సౌండ్ వంటి ఫీచర్లున్న ఈ స్మార్ట్‌ఫోన్లు యాపిల్ ఐఫోన్–ఎక్స్, గూగుల్ పిక్సెల్–2 ఫోన్లకు గట్టిపోటీనిస్తాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్లు మార్చి 16 నుంచి కస్టమర్లను అందుబాటులోకి రానున్నవి. ఎస్9 స్మార్ట్‌ఫోన్‌లో 5.8 అంగుళాల డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఎస్9 ప్లస్‌లో 6.2 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్/ ఫ్రంట్ కెమెరాలు, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment