రోజూ రెండుకంటే ఎక్కువేస్తే..!
లండన్: ప్రతి రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల పానీయాలు తీసుకునే పెద్దవారికి గుండెపోటు సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం. వారానికి 14 రకాల మత్తుపానీయాలు తీసుకునే పురుషుల్లో మాత్రం గుండెలోని ప్రధాన కవాటాలను, ధమనులను ప్రభావితం చేస్తాయని, రక్తాన్ని శరీరానికి పంపించడంలో తేడా వస్తుందని హెచ్చరిస్తోంది.
ఇక మహిళల్లో మాత్రం ఈ సమస్య తీవ్రంగా ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది. హార్వార్డ్ మెడికల్ స్కూల్ కు చెందిన కొంతమంది బృందం ఈ అంశంపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. హృదయనాళాలు పెరిగిపోవడంగానీ, తగ్గిపోవడం లేదా, హృదయ కండరాలు పటుత్వం కోల్పోవడంవంటి సమస్యలు కూడా వస్తాయని తెలిపారు.