బ్రిటన్: మందుప్రియులకు మరింత సౌకర్యం కలగనుంది. నోటిద్వారా కాకుండా హ్యాపీగా ఓ చోట కూర్చుని ముక్కుతోనూ, దిక్కులన్నీ కళ్లార్పకుండా చూస్తూ కళ్లతోనూ మద్యం తాగే అవకాశం రానుంది. ఈ సౌకర్యం బ్రిటన్లోని ఓ ఆల్కాలిక్ ఆర్కిటెక్చర్ బార్లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలిసారి మద్యం వాతావరణం ఏర్పాటుచేసి అందులో వచ్చే గాలి ద్వారా దానిని శ్వాస ద్వారా, కళ్లద్వారా ఆస్వాధించే ఏర్పాట్లు చేస్తున్నారు. లండన్లోని బారోగ్ మార్కెట్లో మరో నెల రోజుల్లో ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో ఉపయోగించే స్పిరిట్స్, బీర్స్ అన్నీ కూడా ప్రత్యేక సన్యాసులు తయారు చేయనుండటం విశేషం.
ఇందులో వచ్చే మద్యం తేమ వలన దుస్తులు, జుట్టు పాడవకుండా తలనుంచి భుజాల మీదుగా కిందివరకు కప్పి ఉంచే ఓ రకమైన టోపీని అందిస్తారు. ఇక గుప్పుమంటూ వచ్చే మందు ఆవిరిని ఊపిరితో బిగబట్టి లాగేసి మత్తులో తేలుతున్న అనుభూతిని పొందవచ్చు. అయితే, నేరుగా మద్యం తాగే స్థాయికన్నా 40శాతం తక్కువ మద్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నేరుగా లివర్పై అధిక ప్రభావాన్ని చూపించే ప్రమాదం పొంచి ఉంది. ఈ బార్లో మద్యంలో కలిపి పదార్థాల హెచ్చుతగ్గులను పరిశీలించేందుకు ప్రత్యేక శాస్త్రవేత్తలను, కెమిస్ట్లను కూడా ఈ బార్లో ఉంచనుండటం మరొక ప్రత్యేకత. ఒక్కసారి ఈ బార్లోకి అడుగుపెట్టాలంటే 15వందల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లాక ఖర్చులు మాత్రం అదనం.
ఇక కళ్లతో, ముక్కుతో మందుకొట్టొచ్చు!
Published Sun, Jul 12 2015 7:05 PM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM
Advertisement