కట్టుకున్న భార్యను స్నేహితులతో గడపాలని వేధించి.. | Husband Brutally Molested His Wife In karnataka | Sakshi
Sakshi News home page

కట్టుకున్న భార్యకు మద్యం తాగించి, ఆపై..

Jun 10 2021 11:31 AM | Updated on Jun 10 2021 11:55 AM

Husband Brutally Molested His Wife In karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శివాజీనగర(కర్ణాటక): మద్యం తాగాలని, తన స్నేహితులతో గడపాలని భార్యను వేధిస్తున్న ఓ ఘరానా భర్త ఉదంతమిది. బెంగళూరు శివాజీనగరకు చెందిన వసీం షరీఫ్‌పై ఈ మేరకు భార్య ఫిర్యాదు చేసింది. మూడేళ్ల కిందట ఇతనికి దూరపు బంధువైన యువతితో పెళ్లయింది. కొంతకాలానికి గోవాటూర్‌కు తీసుకొని వెళ్లి తనతో మద్యం తాగాలని ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదని తీవ్రంగా కొట్టాడు. తరువాత హోటల్‌కు భోజనానికి వెళ్లి అక్కడ తన స్నేహితులతో కలసి గడపాలని భార్యను పీడించాడు.

ఆమె ససేమిరా అనడంతో మళ్లీ హింసించాడు. ఫలితంగా ఆమెకు అబార్షన్‌ అయ్యింది. గర్భందాల్చి ఇటీవల ఆడ బిడ్డ పుట్టగా వేధింపులు మరింతగా పెరిగాయని బాధితురాలు శివాజీనగర మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో వాపోయింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

చదవండి: క్యాప్యూల్స్‌ రూపంలో బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement