అడ్డగుట్ట: చేసుకున్న సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అడ్డగుట్ట బీ సెక్షన్‌కు చెందిన రుద్రమోహన్(34) వృత్తిరిత్యా ఆటోడ్రైవర్. భార్య పిల్లలతో నివాసముంటున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం తుకారాంగేట్ పహాడీ హనుమాన్ దేవాలయం సమీపంలోకి యాసిడ్ బాటిల్ తీసుకొని వెళ్లాడు. ఉన్నట్టుండి తన వద్దనున్న యాసిడ్ బాటిల్ తెరచి యాసిడ్ సేవించాడు. అనంతరం, తన అన్నకు ఫోన్ చేసి తాను యాసిడ్ తాగానని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
దీంతో వెంటనే మోహన్ అన్న సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ అతిగా సేవించడం వల్ల కడుపులోని అవయవాలు పూర్తిగా కాలీపోవడంతో చికిత్స మధ్యలోనే మోహ న్ మృతి చెందాడు. కుటుంభసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మతుడి జేబులో ఓ సూసైడ్ నోట్ లభ్యమైందని అందులో ‘‘ నా చావుకు ఎవరు బాధ్యులు కారు. జీవితంపై విరక్తి చెంది నన్ను నేను చంపుకుంటున్నాను. నన్ను క్షమించండి. అమ్మ ముందు’’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు.
యాసిడ్ తాగి ఆత్మహత్య
Published Thu, Aug 20 2015 11:35 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM
Advertisement
Advertisement