Published
Sat, Oct 15 2016 9:24 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
చౌటుప్పల్ : మద్యం తాగి వాహనాలు నడుపవద్దని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్‌రావు అన్నారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాల నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణపై కమిషనర్ మహేష్ భగవతి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఆయన ఆదేశాల మేరకే భువనగిరి, చౌటుప్పల్‌లలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించా లన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డి, సీఐ నవీన్‌కుమార్, ట్రాఫిక్ సీఐ రవికిరణ్, ఎస్‌ఐ మధుసూదన్ పాల్గొన్నారు.