మహిళ పాడు పని.. యాక్‌ థూ అంటున్న జనాలు | Woman Makes Party Drink in Toilet Bowl And Serves It to Friends | Sakshi
Sakshi News home page

మహిళ పాడు పని.. యాక్‌ థూ అంటున్న జనాలు

Published Wed, Apr 28 2021 3:49 PM | Last Updated on Thu, Apr 29 2021 8:43 AM

Woman Makes Party Drink in Toilet Bowl And Serves It to Friends - Sakshi

పార్టీలు అనగానే చాలు ఎగేసుకుని వెళ్లే జనాలు సమాజంలో కోకొల్లలు. ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్‌ కూడా వదలరనే సామెత వీరిని చూశాకే వచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఫ్రీ పార్టీలకు ఆశపడితే.. ఒక్కోసారి ఎలాంటి దరిద్రమైన అనుభవాలు చవి చూడాల్సి వస్తుందో ఇది చదివితే తెలుస్తుంది. అన్నా షో అనే ఫేస్‌బుక్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు వీడియోలోని మహిళని ఛీ నువ్వసలు మనిషివేనా.. అంటూ తిట్టని తిట్లు తిడుతున్నారు. ఇంతకు సదరు మహిళ చేసిన ఘనకార్యం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

ఈ వీడియోలో ఓ మహిళ పార్టీ ఇస్తానంటూ స్నేహితులను ఇంటికి ఆహ్వానించింది. పార్టీకి వచ్చిన అతిథుల కోసం ఓ డ్రింక్‌ తయారు చేసింది. అయితే ఇందుకోసం సదరు మహిళ టాయిలెట్‌ బౌల్‌ని వినియోగించింది. తొలుత మహిళ టాయిలెట్‌ బౌల్‌లో ఓ వస్త్రం పెట్టి దాన్ని కవర్‌ చేస్తుంది. ఆ తర్వాత దాని మీదుగా ఐస్‌ క్యూబ్స్‌, క్యాండీస్‌, ఐస్‌క్రీమ్‌ వేస్తుంది. ఆ తర్వాత ఫ్లష్‌ ట్యాంక్‌ ఒపెన్‌ చేసి దానిలో సోడా డ్రింక్‌, స్ప్రైట్‌, ఫాంటా, మిరిండా, ఇతర స్వీట్‌నర్స్‌ వేస్తుంది. ఆ తర్వాత ఫ్లష్‌ బటన్‌ ప్రెస్‌ చేస్తుంది. దాంతో ట్యాంక్‌లో కలిపిన డ్రింక్‌ ఇక్కడకు వస్తుంది.

ఆ తర్వతా సదరు మహిళ గరిటెతో ఆ డ్రింక్‌ను తీసి.. గ్లాస్‌ల్లో పోసి పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్‌కి సర్వ్‌ చేస్తుంది. మహిళ ఈ డ్రింక్‌ తయారు చేసే బాత్రూమ్‌ పక్కనే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్‌ ఉన్నారు. అయితే వీరిలో ఒకరు సదరు మహిళ డ్రింక్‌ని టాయిలెట్‌ బౌల్‌లో తయారు చేసిందని గుర్తించి.. ఆ విషయాన్ని మిగతా వారికి చెప్తాడు. అ‍ప్పుడు చూడాలి వారి రియాక్షన్‌.. కక్కలేక.. మింగలేక నానా అవస్థలు పడ్డారు. వెంటనే యాక్‌ అంటూ ఆ డ్రింక్‌ని తీసుకెళ్లి టాయిలెట్‌లో పోశారు. 

ఇక వీడియో చూసిన జనాలు.. ‘‘ఛీ ఇలాంటి చండాలమైన ఐడియాలు ఎలా వస్తాయి’’.. ‘‘ఈ వీడియో చూశాక.. బయట తినాలంటేనే భయమేస్తుంది.. జీవితం మీద విరక్తి తెప్పించావ్’’‌.. ‘‘అందుకే నేను వేరే వాళ్లింటికి వెళ్లినప్పుడు ఏం తినను.. తాగను’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: కొంపముంచిన ఫేస్‌బుక్‌ యాడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement