బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. అద్భుతమైన డిటాక్స్ డ్రింక్ అయిన ఈ మొరింగ వాటర్‌ని తప్పక ట్రై చేయండి. ఇది సన్నగా, నాజుగ్గా ఉండేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అందెలాగంటే..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం..మొరింగ పౌడర్ 12% ఫైబర్‌ని అందిస్తుంది. ఇది మిమ్మల్ని నిండుగా ఉన్న ఫీల్‌ని కలిగిస్తుంది. ఆకలి కోరికను నియంత్రిస్తుంది.
ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా మొరింగ మంచి జీవక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకం, ఉబ్బరం, వంటి సమస్యలను దూరం చేస్తుంది. త్వరితగతిన జీర్ణం అయ్యేలా చేస్తుంది.
ఇది ముఖ్యంగా ఆకలిని ఆరికట్టడంలో సహాయపడుతుంది. డైట్ ప్లాన్‌కు కట్టుబడి ఉండేలా చేస్తుంది.
ఇది మంచి మెటబాలిజం బూస్టర్. జీవక్రియను పెంచి వేగవంతంగా బరువు తగ్గేలా చేస్తుంది.
కేలరీను వేగవంతంగా కరిగించడంలో సహాయపడుతుంది.
అంతేగాదు ఎన్‌ఐహెచ్ ఎలుకలపై చేసిన అధ్యయనంలో మొరింగ పౌడర్ జీవక్రియను మెరుగుపరుస్తుందని వెల్లడయ్యింది.
ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఎలా తయరు చేస్తారంటే..
మొరింగ అంటే మునగాకులు. వీటి పౌడర్‌నే మొరింగ పౌడర్ అని పిలుస్తారు. రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ మొరింగ పౌడర్, కొద్దిగా ఉప్పు వేయాలి. అంతే మొరింగ వాటర్ రెడీ. మంచి ప్రయోజనాలు పొందాలనుకుంటే పరగడుపున ఒక గ్లాస్ తీసుకోవడం మంచిది. మెరుగైన జీర్ణక్రియ కోసం భోజనానికి ముందు లేదా తర్వాత సిప్ చేయండి.
మంచి ఫలితాలు పొందాలనుకుంటే గోరు వెచ్చని నీటిలోనే మొరింగ పౌడర్‌ని వేసుకుని తాగితేనే ఉంటుంది. ఈ మొరింగ నీటిని ఆహారంలో భాగం చేసుకుంటే సహజమైన పద్ధతిలో వేగంగా బరువు తగ్గగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!)
Comments
Please login to add a commentAdd a comment