సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో నైట్ షిఫ్టులు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అమెరికా, యూకే ఆధారిత కంపెనీల్లో పని చేస్తుంటే నైట్ షిఫ్ట్‌లు చేయక తప్పదు. ఉద్యోగం కోసం కొందరు తప్పక నైట్ షిఫ్ట్‌లకు అంగీకరించినా.. వారి జీవన విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. రాత్రిళ్లు మేల్కొని పనిచేయాల్సి ఉంటుంది. మెలకువగా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయినా ఎలాగోఒకలా డ్యూటీ చేసినా.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల రావడం కామన్.
అదే పనిగా నైట్ షిఫ్ట్...
అందుకే రాత్రిపూట పని చేయడానికి చాలా వరకు ఇష్టపడరు. కానీ... కొన్ని చోట్ల కార్పొరేట్ కంపెనీల్లో బాస్‌లు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ బలవంతంగా నైట్ షిఫ్ట్‌లు చేయిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉదంసింగ్ నగర్ జిల్లాలో ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..టేకి రవ్లీన్, రవ్లీన్ కౌర్ ఇద్దరూ దంపతులు. వీరు ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ట్రాన్సిట్ క్యాంపు ప్రాంతంలోని హౌసింగ్ డెవలప్‌మెంట్‌లో రౌలీన్ నివసిస్తున్నారు. టెకీ రవ్లీన్ పంత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
పగ పెంచుకుంది
అదే కంపెనీలో పనిచేస్తున్న రవ్లీన్ హెడ్ దీపక్ భాటియా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ ఇటీవల రవ్లీన్‌కు అదే పనిగా నైట్ షిఫ్ట్ వేయిస్తున్నాడు. అంతే కాకుండా జీతం కూడా పెంచలేదు. రోజూ భర్త రాత్రికి వెళ్లి నైట్ షిఫ్ట్ చేసి తెల్లవారుజామున తిరిగి వచ్చేవాడు, దీంతో క్రమంగా అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ క్రమంలో తన భర్త యజమానిపై రవ్లీన్ కౌర్ పగ పెంచుకుంది. అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుని అందుకోసం ఓ ప్లాన్ వేసింది.. ఓ రోజు రాత్రి మాస్క్ ధరించి భర్త బాస్ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న యజమాని తల్లిపై దాడి చేసి.. ఆమె తలపై సుత్తితో బాదింది.
ఆమె గట్టిగా అరిచింది. ఈ క్రమంలో.. అరుపులు విని ఆమె మనవడు గదిలోకి వచ్చాడు. దీంతో ఆ మహిళ భయపడి అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. సీసీటీవీల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం రివెంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి Aunty Network: హోరు వానలో.. కూర్చుని ముచ్చట్లు పెట్టిన ఆంటీలు..
Comments
Please login to add a commentAdd a comment