సాక్షి, బెంగళూరు: కరోనా లాక్‌డౌన్ సమయంలో బాస్ అనే పదంపై దర్శకుడు పవన్ ఒడెయర్ చేసిన ట్వీట్ సినీ అభిమానుల మధ్య వాడీవేడి చర్చను రేకెత్తించింది. సినిమా చిత్రీకరణ సమయంలో సామాజీక దూరంను పాటిస్తాం, లవ్‌యూ బంగారం, సోదర, బాస్ అని ఒడెయర్ చేసిన ట్విట్‌కు హీరో యశ్ అభిమానులు అభినందనలు చెబుతుండగా, హీరో దర్శన్ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినిమా రంగంలో ‘బాస్’ అనే పదం ఒక దర్శన్‌కు మాత్రమే దక్కుతుందని అయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. యశ్‌ను బాస్ అనడం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దర్శన్ అభిమానులు పవన్ ఒడెయర్‌పై ట్విట్టర్‌లో మండిపడుతున్నారు.
‘బాస్’ కోసం ఆది నుంచి గొడవలు
నిజానికి యశ్–దర్శన్ మంచి స్నేహితులు. అయితే బాస్ అనే పదం కోసం వారి అభిమానుల మధ్య ట్విటర్‌లో మాటల యుద్ధం జరుగుతున్నా హీరోలు స్పందించలేదు. బాస్ అనే పదాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు అని యశ్ అభిమానులు వాదనకు దిగుతున్నారు. గతంలో శాండల్‌వుడ్‌లో ఎవరు బాస్ అనే విషయంపై పెద్ద వివాదం జరిగింది. హీరో శివరాజ్‌కుమార్‌కు చందనవన బాస్ అని బిరుదునివ్వడంతో గొడవకు తెరదించారు. మరో పక్క యశ్ ఇటీవల కొనుగోలు చేసిన కారుకు బాస్ అని అక్షరాలు వచ్చేలా 8055 నంబర్‌ను రిజిస్టర్ చేయించారు.
రగడెందుకు: పవన్ ఒడెయర్
సినిమా రంగంలో సామాన్యంగా అందరినీ బాస్ పదంతో సంబోధిస్తారు. యశ్‌ను కలిసిన సందర్భంగా బాస్ అని అంటూ ట్వీట్ చేయటంపై ఇంత రాద్ధాంతం అవసరంలేదని దర్శకుడు పవన్ ఒడెయర్ అన్నారు. దర్శకులు, నిర్మాతలను తను బాస్ అని పిలుస్తానంటూ క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment