Published
Thu, Oct 10 2013 3:08 PM
| Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
గిన్నిస్ బుక్ లో 'బాస్' సినిమా పోస్టర్!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన బాస్ చిత్రం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాస్ చిత్రానికి సంబంధించిన అతిపెద్ద పోస్టర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. నాలుగు నెలలపాటు తీవ్రంగా శ్రమించిన అక్షయ్ కుమార్ అభిమానులు ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్ ను రూపొందించారు. అభిమానుల కృషిని అభినందిస్తూ అరుదైన గౌరవం అని అక్షయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
యూకేలోని లిటిల్ గ్రాన్స్ డెన్ ఎయిర్ ఫీల్డ్ లో 58.87 మీటర్ల వెడల్పు, 54.94 మీటర్ల ఎత్తుతో రూపొందించిన పోస్టర్ ను అక్టోబర్ 3 తేదిన ఆవిష్కరించారు. గతంలో మైఖేల్ జాక్సన్ పోస్టర్ రూపొందించిన మైక్రో ఆర్ట్స్(యూకే) బాస్ పోస్టర్ కు రూప కల్పన చేశారు. అతిపెద్ద బాస్ చిత్ర పోస్టర్ వివరాలను గిన్నిస్ బుక్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆంథోని డి సౌజా దర్శకత్వం వహించిన బాస్ చిత్రం అక్టోబర్ 16 తేదిన విడుదల కానుంది.