Ecom Express Announced Deployment of E-Bikes in Hyderabad & Jaipur - Sakshi
Sakshi News home page

డెలివరీ సర్వీస్‌ టార్గెట్‌గా ఈ కామ్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Mon, Apr 18 2022 7:01 PM | Last Updated on Mon, Apr 18 2022 8:08 PM

eCom Express electric Scooters Introduced In Hyderabad - Sakshi

ఈ కామ్‌ ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ సంస్థ హైదరాబాద్‌లో తమ టూవీలర్లను పరిచయం చేసింది. ఈ కామర్స్‌ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కామ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎలక్ట్రిక్‌ టూవీలర్ల మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ కామర్స్‌ రంగానికి సంబంధించి గిగా ఎకానమి వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని డెలివరీ సర్వీస్‌ ఫస్ట్‌ టార్గెట్‌గా  ఈ కామ్‌ టూ వీలర్లు తీసుకువచ్చింది. 2025 నాటికి ఈ కామర్స్‌ డెలివరీ వాహనాల్లో సగం వాటా సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఛార్జింగ్ ఫెసిలిటీతో సహా ఈవి రోల్-అవుట్‌ సర్వీస్‌లను ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌ అందిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో గణనీయమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్‌.. ప్రస్తుతం అక్కడ 3 వీలర్‌ మార్కెట్‌పై ఫోకస్‌ చేసింది. కంపెనీతదుపరి విస్తరణలో భాగంగా హైదరాబాద్‌, జైపూర్‌లో సేవలు ప్రారంభించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement