జియో 100% క్యాష్‌ బ్యాక్‌  | Reliance Jio Happy New Year offer 100 percent cashback | Sakshi
Sakshi News home page

జియో 100% క్యాష్‌ బ్యాక్‌ 

Published Sat, Dec 29 2018 2:41 AM | Last Updated on Sat, Dec 29 2018 2:41 AM

Reliance Jio Happy New Year offer 100 percent cashback - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. రూ. 399తో రీచార్జ్‌ చేసుకుంటే 100% క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చని పేర్కొంది. ఈ–కామర్స్‌ పోర్టల్‌ ఏజియో కూపన్స్‌ రూపంలో ఇది లభిస్తుంది. మైజియో యాప్‌లోని ’మైకూపన్స్‌’ సెక్షన్‌లో ఈ కూపన్‌ క్రెడిట్‌ అవుతుందని.. ఏజియో(అఒఐౖ) యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో షాపింగ్‌ చేసినప్పుడు దీన్ని రిడీమ్‌ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. కాకపోతే కనీసం రూ. 1,000 మేర కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఏజియో వెబ్‌సైట్‌లో లభించే డిస్కౌంటుకు ఇది అదనం. డిసెంబర్‌ 28 – 2019 జనవరి 31 మధ్యలో పాత, కొత్త యూజర్లు చేయించుకునే రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది.  కూపన్స్‌ను మార్చి 15 లోగా రిడీమ్‌ చేసుకోవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement