ఈ కామర్స్ రంగంలో లేటుగా వచ్చినా సంచనాలు సృష్టించడంలో ముందుంది మీషో. ఇటీవల ఆ కంపెనీ ఫౌండర్ కమ్ సీటీవో సంజీవ్ బర్న్‌వాల్ మీషో సెల్లర్లతో కలిసి ఫేస్ టూ ఫేస్ సమావేశాన్ని ఆగ్రాలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువరు సెల్లర్లు తమ వ్యాపార అభివృద్ధికి దోహదం చేసిన అంశాలను సంజీవ్ దృష్టికి తెచ్చారు. అలాంటి ట్రేడ్ సీక్సెట్స్‌ను ఆయన లింక్‌డ్‌ఇన్‌లో బహిర్గం చేశారు. అందులో ఫుట్‌వేర్ వ్యాపారులు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి...
అమన్ (27), యుదీశ్ భగ్‌వానీ (23) అనే ఇద్దరు యువ వ్యాపారవేత్తలు తమ తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న ఫుట్‌వేర్ వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఫుట్‌వేర్ షాప్‌లకు కాకుండా నేరుగా ఈ కామర్స్‌లో తమ వస్తువులు అమ్మాలని వీరిద్దరు నిర్ణయం తీసుకున్నప్పుడు స్థానికంగా, కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది. మంచిగా నడుస్తున్న వ్యాపారాన్ని ముంచేస్తారనే భయాందోళనలు వారి కుటుంబ సభ్యుల్లో నెలకొన్నాయి.
మీషోతో సెల్లర్స్‌గా ఒప్పందం చేసుకున్న తర్వాత అమన్, యుదీశ్‌లు వ్యాపారంలో కొత్త పంథాకు తెర లేపారు. గతంలో తరహాలో తమ ప్రొడక్టులకు ఒకే తరహా ధరను ఫిక్స్ చేయకుండా పరిస్థితులకు తగ్గట్టుగా హెచ్చుతగ్గులు ఉండేలా చూసుకున్నారు. అదే విధంగా ముఖ పరిచయం లేని కస్టమర్లు ఇచ్చే సూచనలు/ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తమ ప్రొడక్టులకు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోయారు.
పాతతరం ఆలోచనలకు కట్టుబడకుండా కొత్తగా ఆలోచిస్తూ అమన్, యుదీశ్‌లు తీసుకున్న నిర్ణయంతో వారి ఫుట్‌వేర్ వ్యాపారం రూపు రేఖలు మారిపోయాయి. రోజుకు వెయ్యికి తక్కువ కాకుండా ఆర్డర్లు వస్తున్నాయి. మునుపెన్నడూ చూడని లాభాలు వారి వశం అయ్యాయి. ఇప్పుడు వారి పెద్దలు సైతం హర్షం వ్యక్తం చేస్తుండగా బెస్ట్‌సెల్లర్స్‌గా గుర్తిస్తూ మీషో సీటీవో సైతం వారిని నేరుగా కలిసి మాట్లాడారు.
అమన్, యుదీశ్‌ల సక్సెస్‌పై మీషో ఫౌండర్ సంజీవ్ స్పందిస్తూ.. ధరలు నిర్ణయించడంలో చూపిన చొరవ, కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను గౌరవిస్తూ అందుకు అనుగుణంగా వారు చేపట్టిన మార్పులు సక్సెస్‌కి కారణం అయ్యాయంటూ వివరించారు.
చదవండి: 40-50 ఏళ్ల వయస్సులో బిజినెస్‌లో రాణించాలనుకునే వారి కోసం
Comments
Please login to add a commentAdd a comment