
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు నుంచి తెలంగాణకు మరో తీపి కబురు అందింది. ఈ కామర్స్ రంగంలో శరవేగంగా వృద్ధి కనబరుస్తోన్న మీషో సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్ నగరంలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఈ విషయం వెల్లడించారు.
మీషో ఫౌండర్ ఆత్రేయతో మంత్రి కేటీఆర్ జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు మీషో ఒకే చెప్పింది. హైదరాబాద్‌లో ఫెసిలిటీ సెంటర్‌తో పాటు టైర్ టూ సిటీస్‌లో ఆన్‌బోర్డ్ రిటైల్ సెల్లర్స్‌గా వ్యవహరించనుంది. టైర్ 2 సిటీస్‌లో ఉన్న ఐటీ హబ్స్, టీశాట్ సెంటర్లను ఈ మేరకు మీషో ఉపయోగించుకుంటుంది.
Second major announcement from Davos! @Meesho_Official, the fast growing eCommerce company agreed to set up their facility in Hyderabad. Meesho will be working with the Govt. of Telangana in onboarding the retail sellers in Tier-II towns. pic.twitter.com/E1ciuXlbX9
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 23, 2022
చదవండి: దావోస్‌లో యంగ్ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్ మాటామంతి
Comments
Please login to add a commentAdd a comment