వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ మార్కెట్‌లో మరోసారి పట్టు సాధించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నహకాలు మొదలుపెట్టింది. నిధుల సమీకరణపై సాఫ్ట్‌బ్యాంకు గ్రూపుతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఫలిస్తే ఫ్లిప్‌కార్ట్‌లోకి రూ. 3,652 వేల కోట్ల పెట్టుబడులు సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు నుంచి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. అయితే 2017లో తన వాటలను అమ్మేసింది సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో మెజారిటీ వాటాలు వాల్‌మార్ట్ సంస్థ పేరిట ఉన్నాయి.
దేశీయంగా ఆన్‌లైన్ మార్కెట్‌కు ఊపు తెచ్చిన ఈ కామర్స్ సంస్థల్లో ఫ్లిప్‌కార్ట్ ఒకటి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా ఉన్న అమెజాన్ ఉంది. నిధుల సమీకరణతో మారోసారి మార్కెట్‌లో తన సత్తా చూపించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment