Soft Bank
-
సాఫ్ట్‌బ్యాంక్.. పేటీఎం వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో 4.5 శాతం వాటా విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్‌డీల్ ద్వారా ఈ వాటాను 20 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1,627 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. షేరుకి రూ. 555–601.55 ధరల శ్రేణిలో వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. పేటీఎమ్ ఐపీవో తదుపరి లాకిన్ గడువు ముగియడంతో సాఫ్ట్‌బ్యాక్ వాటా విక్రయ సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షేరు పతనం బీఎస్ఈలో పేటీఎం షేరు బుధవారం(16న) 4 శాతం పతనమై రూ. 601.55 వద్ద ముగిసింది. ఈ ధరలో షేర్లను విక్రయిస్తే సాఫ్ట్‌బ్యాంక్‌కు 21.5 కోట్ల డాలర్లు లభిస్తాయి. 2017 చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌బ్యాంక్ 160 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఐపీవోలో 22 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీని విక్రయించింది. పేటీఎమ్‌లో ప్రస్తుత సాఫ్ట్‌బ్యాంక్ వాటా విలువ 83.5 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతోంది! చదవండి: భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
ఐపీవోకు వెళ్లేముందు ఓయోకు భారీ షాక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ఓయో విలువ 8 బిలియన్ డాలర్ల నుంచి 6.5 బిలియన్ డాలర్లకు క్షీణించినట్లు తెలుస్తోంది. ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి విలువలో 20 శాతంమేర కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఓయోలో పెట్టుబడుల విలువను 2.7 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలియజేశాయి. గతేడాది ప్రయివేట్ మార్కెట్లలో 8 బిలియన్ డాలర్ల స్థాయిలో లావాదేవీలు జరగ్గా.. ఇటీవల 6.5 బిలియన్ డాలర్ల విలువలో నమోదౌతున్నట్లు వివరించాయి. ఈ ప్రభావంతో సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో 12.3 లక్షల ఓయో షేర్లు విక్రయమైనట్లు తెలుస్తోంది. అంతక్రితం వారం 1.6 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి. కాగా.. నష్టాలను తగ్గించుకుంటూ నిర్వహణా లాభాలు ఆర్జించినట్లు ఫైనాన్షియల్స్పై గత నెలలో ఓయో ప్రాస్పెక్టస్‌ను ఆప్డేట్ చేసింది. దీంతో షేరు ప్రయివేట్ మార్కెట్లో రూ. 94ను తాకింది. తాజాగా ఈ విలువ రూ. 81కు క్షీణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓయో రూ. 8,430 కోట్ల సమీకరణకు వీలుగా గతేడాది అక్టోబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తదుపరి 2022 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,459 కోట్ల ఆదాయాన్ని, సర్దుబాటు తదుపరి రూ. 7.3 కోట్ల ఇబిటాను ఆర్జించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వరల్డ్ టాప్ బ్యాంకర్..సాఫ్ట్ బ్యాంక్‌కు ఊహించని షాక్!
టోక్యో: అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనల కారణంగా పెట్టుబడుల విలువ కరిగిపోవడంతో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 23.4 బిలియన్ డాలర్ల భారీ నష్టం నమోదు చేసింది. గతేడాది ఇదే వ్యవధిలో 5.6 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించింది. సమీక్షాకాలంలో అమ్మకాలు 6 శాతం పెరిగి 11.6 బిలియన్ డాలర్లకు చేరాయి. కంపెనీ ఏర్పాటైన తర్వాత నుంచి ఒక త్రైమాసికంలో ఇంత భారీ నష్టాలు ఎన్నడూ చూడలేదని సంస్థ సీఈవో మసయోషి సోన్ తెలిపారు. గత ఆరు నెలలుగా నమోదైన నష్టాలు 37 బిలియన్ డాలర్లకు ఎగిశాయని వివరించారు. చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబాలో వాటాల విలువ భారీగా పడిపోవడం .. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నష్టాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిల్చింది. అలాగే, యెన్ విలువ పడిపోవడం కూడా మరో కారణం. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కారణంగా ఈ సవాళ్లు నెలలు లేదా సంవత్సరాల తరబడి కూడా కొనసాగవచ్చని సోన్ పేర్కొన్నారు. -
బెటర్‌డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి!
జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల్ని తొలగించిన బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ మరోసారి చర్చాంశనీయమయ్యారు. ఈ సారి ఏకంగా 920మంది భారతీయ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఆర్ధికంగా ఆదుకుంటుంది. బెటర్ డాట్ కామ్ సంస్థ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1.5 బిలియన్ల నిధుల్ని సేకరించారు. అందులో వ్యక్తిగతంగా సాఫ్ట్ బ్యాంక్‌కు 750 మిలియన్ డాలర్లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు గార్గ్‌ను ఆర్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించారు. గతేడాది డిసెంబర్లో బెటర్ డాట్ కామ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు విశాల్ గార్గ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో 900మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తొలగింపు సంచలనం సృష్టించింది. తమ అనుమతులు లేకుండా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం అంటూ ఉద్యోగులు గార్గ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే ఈ ఏడాది మార్చిలో 4వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు. ఇక మనదేశానికి చెందిన 920 ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలకు ఆమోదం తెలిపారు. అరోరాను సొంతం చేసుకునేందుకే గతేడాది నవంబర్‌లో అరోరా అక్విజిషన్ కార్ప్ సంస్థను బెటర్.కామ్ 1.5బిలియన్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల ఒప్పందంలో భాగంగా సాఫ్ట్ బ్యాక్ ఇచ్చే రుణం కోసం ఎదురు చూడకుండా అరోరా అక్విజిషన్ కార్ప్‌కు సగం చెల్లించి ఈ కొనుగోళ్ల డీల్‌ను క్లోజ్ గార్గ్ క్లోజ్ చేశారు. ఈ సందర్భంగా అరోరా ప్రతినిధులు మాట్లాడుతూ.. బెటర్ సంస్థ ఫౌండర్, అధినేత విశాల్ గార్గ్ సాఫ్ట్ బ్యాంక్‌కు రుణాల్ని ఇచ్చేలా వ్యక్తిగత హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ రుణాల్ని చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కాబట్టి స్వచ్ఛంగా సంస్థ నుంచి స్వచ్చందంగా వెళ్లి పోవాలనుకున్న 920మంది భారతీయ ఉద్యోగులు రాజీనామాల్ని అంగీకరించారు. ఈ క్రమంలో సాఫ్ట్ బ్యాంక్‌కు 750 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇక నాదగ్గర ఏమీలేదు. ఇది నిజం. నేను వ్యక్తిగతంగా మూడు వంతుల బిలియన్ డాలర్లకు హామీ ఇచ్చాను. దానికి నేను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాను. "అని ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో బెటర్ డాట్ కామ్ సీఈవో పేర్కొన్నారు. చదవండి👉విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే.. -
ఆర్బీఎల్ బ్యాంకు లాభం రూ.197 కోట్లు
ముంబై: ఆర్బీఎల్ బ్యాంకు మార్చి త్రైమాసికానికి రూ.197 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభం రూ.75 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 25 శాతం పెరిగి రూ.1,131 కోట్లకు చేరింది. రుణాల్లో వృద్ధి 2 శాతమే నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 5.04 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 7 శాతం క్షీణించి రూ.511 కోట్లకు పరిమితమైంది. బ్యాంకు బ్యాలన్స్ షీట్ 20 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు ఆర్బీఎల్ బ్యాంకు తాత్కాలిక సీఈవో, ఎండీ రాజీవ్ అహుజా తెలిపారు. స్థూల మొండి బకాయిలు (ఎన్పీఏలు) 2021 డిసెంబర్ త్రైమాసికం నాటికి ఉన్న 4.84 శాతం నుంచి 2022 మార్చి చివరికి 4.40 శాతానికి దిగొచ్చాయి. ఎన్పీఏల కోసం రూ.401 కోట్లను పక్కన పెట్టింది. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 16.82 శాతానికి చేరింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఎల్ బ్యాంకు రూ.75 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2020–21లో బ్యాంకు రూ.508 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. చదవండి: సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టాలు -
సాఫ్ట్‌బ్యాంక్‌కు భారీ నష్టాలు
టోక్యో: అంతర్జాతీయంగా పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోవడంతో జపాన్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం భారీగా నష్టాలు చవి చూసింది. ఏకంగా 1.7 లక్షల కోట్ల యెన్ల (దాదాపు 13 బిలియన్ డాలర్లు) నష్టం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్ 4.9 లక్షల కోట్ల యెన్ల లాభాలు ఆర్జించింది. తాజా సమీక్షాకాలంలో అమ్మకాలు 10.5 శాతం పెరిగి 6.2 లక్షల కోట్ల యెన్లకు చేరాయి. కంపెనీ పోర్ట్‌ఫోలియోకు ప్రత్యక్షంగా ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో సంబంధం లేకపోయినా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన ఇంధన ధరలు మొదలైనవన్నీ కొంత కాలం పాటు తమ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇక నుంచి తమ పెట్టుబడులపై మరింత అదుపు తెచ్చుకోవడంతో పాటు కొంత రక్షణాత్మకంగా వ్యవహరించనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్ తెలిపారు. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు యాహూ వెబ్ సర్వీసెస్, చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా, వాహన సేవల సంస్థ డీడీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు ఉన్నాయి. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, ట్విటర్‌ను ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్లగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ఓలా ఎలక్ట్రిక్ సంచనలం.. దేశంలో మరో భారీ ప్లాంట్ నిర్మాణం!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మన దేశంలో మరో భారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతుంది. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ మద్దతు గల ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని 50 గిగావాట్(జీడబ్ల్యుహెచ్) సామర్థ్యంతో నిర్మించాలని యోచిస్తోంది. 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి ఓలాకు 40 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్థ్యం అవసరం. అలాగే, మిగతా 10 జీడబ్ల్యుహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం వినియోగించుకోవాలని భావిస్తుంది. 2023 నాటికి 1 జీడబ్ల్యుహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, రాబోయే 3-4 సంవత్సరాల్లో 20 జీడబ్ల్యుహెచ్'కు విస్తరించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే, ఇందుకోసం $1 బిలియన్ వరకు పెట్టుబడి అవసరం. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి బ్యాటరీ సెల్స్'ను దిగుమతి చేసుకునే ఓలా అధునాతన సెల్ బ్యాటరీ టెక్నాలజీ ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోందని ఒక కంపెనీ అధికారి తెలిపారు. ఇంకా భారతదేశంలో బ్యాటరీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ అధికారి పేర్కొన్నారు. టెస్లా ఇంక్(టిఎస్ ఎల్ ఎ) వంటి ప్రధాన గ్లోబల్ ఆటోమేకర్లకు సరఫరా చేసే సీఏటీఎల్, ఎల్ జి ఎనర్జీ సొల్యూషన్స్, పానాసోనిక్ (6752.టి)తో సహా కొన్ని ఆసియా కంపెనీలు ప్రస్తుతం బ్యాటరీ సెల్ తయారీపై ఆధిపత్యం వహిస్తున్నాయి. దేశ చమురు దిగుమతిలను తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించడానికి కంపెనీలు స్థానికంగా గ్రీన్ ఎనర్జీ వాహనాలు, బ్యాటరీలను తయారు చేయలని కేంద్రం కోరుతోంది. ఇందుకోసం 6 బిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓలా ప్రస్తుతం రోజుకు సుమారు 1,000 స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి హోండా ఈవీ స్కూటర్ వచ్చేది అప్పుడే..!) -
రాబోయే భవిష్యత్తు భారతదేశానిదే!
సన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సిఎ) & బ్లూమ్ బెర్గ్ కలిసి నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ప్రముఖ జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసయొషి మాట్లాడుతూ.. భారత ఆర్థిక భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు మెరుగైన భవిష్యత్తు ఉందని, ఇక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బాగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ఇప్పటివరకు భారతదేశంలో 14 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది అని అన్నారు. సాఫ్ట్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు అని, ఈ గ్రూప్ భారతదేశంలోని యూనికార్న్‌లకు కనీసం 10శాతం నిధులను సమకూర్చినట్లు తెలిపారు. సాఫ్ట్ బ్యాంక్ పోర్ట్ ఫోలియో గల సంస్థలు భారతదేశంలో ఒక మిలియన్ కొత్త ఉద్యోగాలను సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. "నేను రాబోయే భవిష్యత్తు భారతదేశానిదే అని నమ్ముతున్నాను. భారతదేశంలోని యువ వ్యవస్థాపకుల అభిరుచిని నేను విశ్వసిస్తాను. భారతదేశం గొప్ప ఉజ్వల భవిష్యత్తు ఉంది. భారత్‌లో ఉన్న యువ ఆవిష్కర్తలంతా ముందుకు రావాలని కోరుకుంటున్నాను, అందుకు తమ మద్దతు ఉంటుంది" అని ఆయన అన్నారు. ఈ ఏడాది భారతీయ స్టార్ట్-అప్ కంపెనీలలో 3 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. గత నెలలో సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్ మెంట్ ఎడ్వైజర్స్ సీఈఓ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. సరైన వాల్యుయేషన్ వద్ద సరైన అవకాశాలు వస్తే వచ్చే ఏడాది భారతదేశంలో 10 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. పేటీఎం, ఓలా, డెలివరీ, ఫ్లిప్‌కార్ట్, మీషో సహా పలు ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టింది. (చదవండి: దేశంలో భారీగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ కంపెనీవే!) -
ఇలా చేస్తే భారత్‌లో 5జీ సేవలు జోరందుకుంటాయ్
న్యూఢిల్లీ: దేశీయంగా టెల్కోలు కొత్త టెక్నాలజీలు ఆవిష్కరించాలన్నా, నాణ్యమైన 5జీ సేవలు అందించాలన్నా భారత టెలికం మార్కెట్లో టారిఫ్‌లు లాభసాటిగా ఉండాలని సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా కంట్రీ హెడ్ మనోజ్ కొహ్లి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీ టెలికం రంగానికి ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా 5జీ విప్లవానికి సిద్ధమయ్యేందుకు పరిశ్రమకు ఇది సహాయపడగలదని కొహ్లి తెలిపారు. ఐవీసీఏ మ్యాగ్జిమం ఇండియా సదస్సు (ఎంఐసీ)లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ‘టారిఫ్‌లు మరింత మెరుగ్గా ఉండాలని నేను భావిస్తున్నాను. అయితే, ఎంత స్థాయిలో ఉండాలన్నది నేను చెప్పలేను. అది టెలికం సంస్థల ఇష్టం. స్థూలంగా చెప్పాలంటే టెల్కోలు.. కొత్త టెక్నాలజీలతో పాటు 5జీ సేవలను నాణ్యంగా అందించగలిగేంత స్థాయిలో ఉండాలన్నది నా అభిప్రాయం‘ అని కొహ్లి పేర్కొన్నారు. భారత్‌లో 5జీ సేవల విస్తరణ వేగంగా జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘విద్యుత్ రంగంలాగానే టెలికం కూడా కీలకమైన మౌలిక సదుపాయం. స్థూల దేశీయోత్పత్తి మరింత అధికంగా వృద్ధి చెందడానికి ఇది కూడా ఎంతో ముఖ్యం‘ అని తెలిపారు. వాయిస్ సర్వీసులపై వినియోగదారులకు ఆసక్తి తగ్గిందని.. భవిష్యత్తంతా డేటా, కంటెంట్‌దేనని కొహ్లి చెప్పారు. టెల్కోలు ఇందుకు అనుగుణంగా తమ వ్యాపార విధానాలను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. -
నిధుల సమీకరణలో ఫ్లిప్‌కార్ట్
వెబ్‌డెస్క్: ఆన్లైన్ మార్కెట్లో మరోసారి పట్టు సాధించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నహకాలు మొదలుపెట్టింది. నిధుల సమీకరణపై సాఫ్ట్‌బ్యాంకు గ్రూపుతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఫలిస్తే ఫ్లిప్‌కార్ట్‌లోకి రూ. 3,652 వేల కోట్ల పెట్టుబడులు సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు నుంచి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. అయితే 2017లో తన వాటలను అమ్మేసింది సాఫ్ట్‌బ్యాంకు గ్రూపు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో మెజారిటీ వాటాలు వాల్‌మార్ట్ సంస్థ పేరిట ఉన్నాయి. దేశీయంగా ఆన్లైన్ మార్కెట్‌కు ఊపు తెచ్చిన ఈ కామర్స్ సంస్థల్లో ఫ్లిప్‌కార్ట్ ఒకటి. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించింది ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం ఇండియాలో ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా ఉన్న అమెజాన్ ఉంది. నిధుల సమీకరణతో మారోసారి మార్కెట్లో తన సత్తా చూపించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతోంది. -
స్విగ్గీలో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడులు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుడ్ ఆర్డర్లు, డెలివరీ సంస్థ స్విగ్గీలో గ్లోబల్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. స్విగ్గీలో 45 కోట్ల డాలర్ల (రూ. 3,348 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసే యోచనలో సాఫ్ట్‌బ్యాంక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్‌తో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, అమన్సా క్యాపిటల్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్, కార్మిగ్నాక్, గోల్డ్‌మన్ శాక్ 80 కోట్ల డాలర్లు(రూ. 5,862 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు ఇంతక్రితం స్విగ్గీ వెల్లడించింది. ఉద్యోగుల ద్వారా: కంపెనీ ఉద్యోగులకు వ్యవస్థాపక సీఈవో శ్రీహర్ష మాజేటి ఈ నెల మొదట్లో పంపిన ఈమెయిల్ ద్వారా స్విగ్గీ తాజా డీల్ వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రత్యర్థి సంస్థ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్విగ్గీ డీల్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
ఏపీలో జపాన్ దిగ్గజం ‘సాఫ్ట్ బ్యాంక్’ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వాహన రంగంలో భారీ పెట్టుబడలు పెట్టేందుకు జపాన్ దిగ్గజ సంస్థ ‘సాఫ్ట్ బ్యాంక్’ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో ‘సాఫ్ట్ బ్యాంక్’ చర్చించింది. సోమవారం హైదరాబాద్‌లోని లేక్ వ్యూ అతిథి గృహంలో జరిగిన ‘బిజినెస్ ఔట్ రీచ్’ కార్యక్రమంలో సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం మంత్రితో భేటీ అయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమం, పరిశ్రమల వృద్ధిని సమాన స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు వెళుతున్నారని ప్రతినిధులకు తెలిపారు. ఎన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టినా.. రాష్ట్రంలో అనుకూలం వాతావరణం ఉంటుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా కొత్త సంవత్సరం కల్లా పరిశ్రమలకు అనుకూలమైన, పారదర్శక పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామని వివరించారు. యువతకు ఉపాధి, మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు.. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు, యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు వంటి అంశాలను మంత్రి ఈ సందర్భంగా ప్రతినిధులకు వివరించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా.. గొప్ప నిర్ణయాలని కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగేందుకు ఆసక్తిగా ఉన్నామని సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం పేర్కొంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది. రెండు వారాల్లో స్పష్టమైన ప్రణాళికతో మరోసారి భేటీ అయి పూర్తి వివరాలు అందించాలని ప్రతినిధి బృందాన్ని మంత్రి కోరారు. సాఫ్ట్ బ్యాంక్ ప్రతిపాదనలను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని గౌతమ్‌రెడ్డి... ప్రతినిధులకు తెలిపారు. అందుకు ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు బిజినెస్ ఔట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివిధ సంస్థలతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) ప్రతినిధుల బృందం మంత్రితో భేటీ అయ్యారు. ఈటీఏ అలెక్ట్రా ఎలక్ట్రానిక్ వెహికిల్స్ సీఈవో బిజు థామస్, విష్ణు గ్రూప్ వైస్ ఛైర్మన్ రవి చంద్రన్ , డెలాయిట్ ప్రతినిధి కౌశల్, జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్, అహ్మదాబాద్‌కు చెందిన ఐఐఎమ్ ప్రతినిధి, ఏపీ బ్రాండింగ్ ప్రమోషన్‌పై పీఆర్ ఏజెన్సీలతో మంత్రి సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని ఐటీ, పరిశ్రమ రంగాల్లో పెట్టుబడులు, సాంకేతికత అభివృద్ధి వంటి అంశాలపై మంత్రి గౌతమ్‌రెడ్డి ఆయా కంపెనీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. -
ఎయిర్‌టెల్‌పై సాఫ్ట్‌బ్యాంక్ కన్ను
న్యూఢిల్లీ : భారత టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలుకు జపాన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి కనబరుస్తోంది. భారతి ఎయిర్టెల్ టెలికాం బిజినెస్, సంబంధిత ఆస్తుల్లో నేరుగా వాటా కొనుగోలుకు లేదా హోల్డింగ్ కంపెనీ ద్వారా ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై సాఫ్ట్‌బ్యాంక్ ముమ్మరంగా చర్చిస్తోంది. ఎయిర్‌టెల్‌కు చెందిన ఇతర టెలికాం మౌలిక వసతులు, సేవల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు సాఫ్ట్‌బ్యాంక్ సంప్రదింపులు జరుపుతోంది. ఎయిర్‌టెల్‌లో ఎంతమేర వాటా కొనుగోలుకు సాఫ్ట్‌బ్యాంక్ ప్రతిపాదిస్తోందన్న వివరాలు వెల్లడికాలేదు. చర్చలు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయని విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడంపై ఎయిర్టెల్ ప్రతినిధులతో సాప్ట్‌బ్యాంక్ విస్తృత సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. -
ఓలా ఎలక్ట్రిక్‌లోకి నిధుల జోరు!
న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ వాహన విభాగం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ(ఓఈఎమ్)లో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ రూ.1,725 కోట్లు(25 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. ఈ మేరకు సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు ఓఈఎమ్ వెల్లడించింది. రూ.10 ముఖ విలువ గల పూర్తిగా, తప్పనిసరిగా మార్చుకునే సిరీస్ బి ప్రిఫరెన్స్ షేర్లను సాఫ్ట్‌బ్యాంక్ టొపాజ్ (కేమ్యాన్) లిమిటెడ్‌కు జారీ చేయడం ద్వారా రూ.1,725 కోట్లు సమీకరించామని ఓఈఎమ్ పేర్కొంది. దీంతో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టిన భారత సంస్థల్లో ఒకటిగా ఓఈఎమ్ చేరింది. సాఫ్ట్‌బ్యాంక్ ఇప్పటివరకూ ఫ్లిప్‌కార్ట్, జొమాటొ, పేటీఎమ్, ఓఈఎమ్ మాతృసంస్థ ఓలాలో కూడా పెట్టుబడులు పెట్టింది. కాగా ఓలాలో అతి పెద్ద సింగిల్ ఇన్వెస్టర్‌గా సాఫ్ట్‌బ్యాంక్ నిలిచింది. రతన్ టాటా పెట్టుబడులు... ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో టాటా సన్స్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా కూడా పెట్టుబడులు పెట్టారు. ఓఈఎమ్ సిరీస్ ఏ పెట్టుబడుల్లో భాగంగా రతన్ టాటా పెద్దమొత్తంలోనే ఇన్వెస్ట్ చేశారు. టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ ఇండియా సంస్థలు కూడా ఓఈఎమ్లో రూ.400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. పది లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు.. భారత్‌లో 2021 కల్లా పది లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంట్లో భాగంగా చార్జింగ్ సొల్యూషన్స్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు, టూ, త్రీ,–ఫోర్ వీలర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుకోవడం తదితర కార్యకలాపాలు చేపడుతోంది. -
ఓలాలో సాఫ్ట్‌బ్యాంకు భారీ పెట్టుబడులు
సాక్షి ,ముంబై: క్యాబ్ అగ్రిగేటర ఓలాకు భారీ పెట్టుబడుల ఆఫర్ లభించింది. జపాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సాఫ్ట్‌బ్యాంకు మరోసారి ఓలాలో భారీ పెట్టుబడులకు దిగుతోంది. ఓలాలో ఒక బిలియన్ డాలర్ల (రూ.704కోట్లు) నిధులను సరఫరా చేయనుందని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఓలాలో 26శాతం వాటా వున్న సాఫ్ట్‌బ్యాంకు మరిన్ని పెట్టుటబడులను ఓలా సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఆమోదించారా లేదా అనేది స్పష్టతలేదు. మరోవైపు బెంగళూరుకు చెందిన కంపెనీ టాక్సీ సేవల సంస్థ ఓలా తన ఆహార పంపిణీ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఇ-ఫార్మసీ వంటి విభాగాలలో పెట్టుబడులకు యోచిస్తోది. -
ఉబెర్‌లో 15% వాటా సాఫ్ట్‌బ్యాంక్‌కు..!
న్యూయార్క్: జపాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్..ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌లో 15 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. అంతే కాకుండా అమెరికాకు చెందిన ఉబెర్ కంపెనీలో వంద కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నదని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం.., ఉబెర్‌లో 15 శాతం వాటాను సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ క్యాపిటల్ కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఉబెర్ డైరెక్టర్ల బోర్డ్‌లో రెండు డైరెక్టర్ల పదవులను పొందే అవకాశాలున్నాయి. -
ఫ్లిప్‌కార్ట్‌లో సాఫ్ట్‌బ్యాంక్ భారీ పెట్టుబడి
విజన్ ఫండ్ ద్వారా 2.5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ ♦ సుమారు 20 శాతం వాటా సాఫ్ట్‌బ్యాంక్ చేతికి ♦ అతి పెద్ద వాటాదారుల్లో ఒకటిగా హోదా న్యూఢిల్లీ: దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. సాఫ్ట్ బ్యాంక్ తన విజన్ ఫండ్ ద్వారా 2.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో అతి పెద్ద ఇన్వెస్టర్లలో ఒకటిగా మారింది. భారతీయ కంపెనీలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే ప్రథమమని పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్... ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే పెట్టుబడి విలువ సుమారు 2.5 బిలియన్ డాలర్లు ఉంటుందని, ఇందులో 1.5 బిలియన్ డాలర్లు నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేయగా, మిగతా 1 బిలియన్ డాలర్లను టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ వెచ్చించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తున్న అత్యంత భారీ ఫండ్ అయిన సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్‌కి తాజా పెట్టుబడి ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు 20 శాతం వాటాలు దక్కినట్లని వివరించాయి. ‘50 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ యూజర్లున్న దేశీ ఇంటర్నెట్ మార్కెట్లో పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయి. భారత ఈ–కామర్స్ మార్కెట్ ఏటా 30 శాతం పైగా వార్షిక వృద్ధి నమోదు చేయనుందని అంచనా‘ అని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. మార్కెట్లో ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి తాజా నిధులు తోడ్పడతాయని వివరించింది. ‘ఫ్లిప్‌కార్ట్, భారత్.. చిరస్థాయిగా గుర్తుంచుకోతగ్గ డీల్ ఇది. అంతర్జాతీయంగా కొన్ని దేశాలు మాత్రమే అత్యుత్తమ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించగలవు‘ అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ పేర్కొన్నారు. మరోవైపు, సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్... భారత్‌ను అవకాశాల గనిగా అభివర్ణించారు. టెక్నాలజీ ఊతంగా ప్రజలు మరింత సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు కృషి చేస్తున్న ఇలాంటి సృజనాత్మక సంస్థలకు తోడ్పడటమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ డీల్‌కు నియంత్రణ సంస్థల నుంచి ఇంకా అనుమతులు లభించాల్సి ఉంది. సన్ స్థాపించిన సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్‌లో టెక్ దిగ్గజాలు యాపిల్, ఫాక్స్‌కాన్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా మొదలైనవి భాగస్వాములుగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌కు పుష్కలంగా నిధులు.. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడుల రాకతో ఫ్లిప్‌కార్ట్ నగదు నిల్వలు ఏకంగా 4 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఫ్లిప్‌కార్ట్ సంస్థ దాదాపు 11.6 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో... టెన్సెంట్, ఈబే, మైక్రోసాఫ్ట్ నుంచి 1.4 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఇక తాజా పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటిదాకా 5 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించినట్లయింది. అమెరికా ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్ ఈ నిధులను వినియోగించనుంది. ఇటు విక్రేతలను, అటు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఇరు సంస్థలు భారీ స్థాయిలో నిధులు కుమ్మరిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా అమెజాన్ భారత విభాగం కార్యకలాపాలపై దాదాపు 600 మిలియన్ డాలర్లు వ్యయం చేసింది. అటు ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది 4 బిలియన్ డాలర్ల దాకా సమీకరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌కి.. దాని పోటీ సంస్థ స్నాప్‌డీల్‌లో కూడా పెట్టుబడులు ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న స్నాప్‌డీల్‌ను విలీనం చేయడం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లోకి పెట్టుబడులతో వాటాలు దక్కించుకోవాలని సాఫ్ట్‌బ్యాంక్ యోచించింది. అయితే, స్నాప్‌డీల్ ఆశించిన రేటు రాకపోవడంతో డీల్ కుదరలేదు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లోకి సాఫ్ట్‌బ్యాంక్ నేరుగా ఇన్వెస్ట్ చేసింది. అటు ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో కూడా పెట్టుబడులు ఉన్న సాఫ్ట్‌బ్యాంక్.. భారత్‌లో దాదాపు 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు 2014లో వెల్లడించింది. ఈ ఏడాదే డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంలో 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,079 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. -
ఓలాకి సాఫ్ట్‌బ్యాంక్ రూ. 1,675 కోట్లు
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా రూ. 1,675 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఓలా మాతృసంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్‌లో రూ. 10 ముఖవిలువ గల 12,97,945 షేర్లను రూ. 12,895 ప్రీమియం ధరకు కొనుగోలు చేసింది. ప్రత్యర్థి సంస్థ ఉబెర్కి గట్టి పోటీనిచ్చేందుకు ఓలా ఈ నిధులను ఉపయోగించుకోనుంది. గతేడాది నవంబర్‌లో షేర్ల కేటాయింపు జరిగింది. ప్రస్తుత పెట్టుబడుల రౌండ్లో ఓలా వేల్యుయేషన్‌ను తక్కువగా లెక్కగట్టినట్లుగా తెలుస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ పెట్టుబడులు గణనీయంగా ఉన్న ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను.. మరో కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించాలని సాఫ్ట్‌బ్యాంక్ యోచిస్తున్న తరుణంలో.. ఓలాలో ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికన్ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కార్యకలాపాలు పటిష్టం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో గట్టి పోటీనిచ్చేందుకు ఓలా భారీగా నిధులు సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
సాఫ్ట్‌బ్యాంక్ అధినేతతో కేటీఆర్ భేటీ
సాప్ట్ బ్యాంకు అధినేత నికేష్ అరోరాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు భేటీ అయ్యారు. శాన్ ప్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు స్థాపన, పెట్టుబడుల అకర్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సిఓఓ అయిన నిఖేష్ అరోరాతో మంత్రి సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశవేట్టిన పారిశ్రామిక విధానం ఉద్దేశాలను, కీలకాంశాలను వివరించారు. 15 రోజుల్లో అనుమతులు, సెల్ఫ్ సర్టిఫికేషన్ వంటి అంశాలను వివరించారు. పారిశ్రామిక అనుమతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని అభినందించిన అరోరా, ప్రభుత్వం ఈ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు కావాల్సిన పలు సలహాలను ఇచ్చారు. టెలికమ్యూనికేషన్లు మెదలు మీడియా, పైనాన్స్ వంటి రంగాల దాక పెట్టుబడులు పెట్టే జపాన్ బహుళజాతి సంస్థ సాప్ట్ బ్యాంకు. బ్రాడ్ బ్యాండ్, ఇంటర్నెట్ వంటి రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను సివోవో నిఖేష్ అరోరాకి మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను, ప్రభుత్వ విధానాలను వివరించారు. టి-హబ్ గురించి వివరించి, ఇప్పటిదాకా దానికి వస్తున్న స్పందన, ఇన్నోవేషన్ రంగంలో స్టార్టప్ లకి అందించాల్సిన సాయంపైన మంత్రి చర్చించారు. అరోరాతో సమావేశం సంతృప్తికరంగా సాగిందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. సాప్ట్ బ్యాంకు పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించినట్టు మంత్రి తెలిపారు. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నట్టు, ఇండియానా పోలీస్, మిన్నియా పోలిస్ నగరాల్లో జరిగిన సమావేశంలో అమెరికన్ పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రాల్లోనూ తెలంగాణ పారిశ్రామిక విధానంలోని పలు అంశాలను ప్రవేశపెట్టాలన్న అభిలాషను వ్యక్తం చేసినట్టు మంత్రి సమావేశంలో నికేష్ అరోరాతో తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు. -
ట్రూ బ్యాలెన్స్ యాప్‌లో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్
సాఫ్ట్ నిధులతో వేగంగా విస్తరిస్తాం: ట్రూ బ్యాలెన్స్ న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మొబైల్ బ్యాలెన్స్ చెకింగ్ యాప్, ట్రూ బ్యాలెన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ, సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా పెట్టుబడులు పెట్టింది. ప్రి పెయిడ్ మొబైల్ అకౌంట్లలో లభ్యమయ్యే బ్యాలెన్స్‌ను, కాల్ లాగ్‌ను, డేటా ప్యాక్ అసెస్మెంట్ను, రీచార్జ్ సర్వీసులను ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ తెలియజేస్తుంది. సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది వెల్లడి కాలేదు. కోటి డౌన్లోడ్లు లక్ష్యం.. 2014లో చార్లీ లీ ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ సాఫ్ట్‌బ్యాంక్ నిధులతో విస్తరణను మరింత వేగవంతం చేస్తామని, తమ సేవలను మరింతగా మెరుగుపరుస్తామని లీ తెలిపారు. భారత్‌లో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లకు చేరువ కావాలన్న తమ ప్రయాణం ఇప్పడే ప్రారంభమైందని, సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా పెట్టుబడులతో ఈ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 20 లక్షల మంది తమ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని, మరో 9 నెలల్లో కోటి డౌన్లోడ్ల మైలురాయిని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
హౌసింగ్ డాట్ కామ్ లోకి సాఫ్ట్ బ్యాంక్ మరో 100 కోట్లు
న్యూఢిల్లీ: రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా మరో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆన్లైన్ ప్రాపర్టీ విభాగంలో స్థానం పటిష్టం చేసుకునేందుకు, మరింత వృద్ధి ప్రణాళికల అమలుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో జేసన్ కొఠారి తెలిపారు. గృహాల కొనుగోలు, విక్రయాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. 2012లో ప్రారంభమైన ఈ సంస్థ.. నెక్సస్ వెంచర్స్, ఫాల్కన్ ఎడ్జ్, హీలియోన్ వెంచర్స్ మొదలైన వాటి నుంచి 100 మిలియన్ డాలర్లదాకా సమీకరించింది. ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్‌కి ఇందులో 30 శాతం వాటాలు ఉన్నాయి. తాజా పెట్టుబడుల అనంతరం సాఫ్ట్‌బ్యాంక్ వాటాలు మరింత పెరిగే అంశానికి సంబంధించిన వివరాలేమీ వెల్లడి కాలేదు. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో హౌసింగ్‌డాట్‌కామ్ తన స్థానాన్ని పటిష్టపర్చుకోగలదని కంపెనీ బోర్డులో డెరైక్టరుగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి జొనాథన్ బులక్ పేర్కొన్నారు. -
నమ్మి పెట్టుబడి పెట్టేదెలా?
-
ఐపీవోకి చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా
హాంకాంగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాల్లో ఉంది. ఇందుకు వీలుగా ఆరు మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు నిర్వహిస్తోంది. అమెరికా మార్కెట్లలో చేపట్టనున్న ఐపీవో ద్వారా కంపెనీ 15 బిలియన్ డాలర్ల వరకూ సమీకరించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే 2012లో వచ్చిన ఫేస్బుక్ ఇష్యూ తరువాత అతిపెద్ద ఐపీవోగా నిలిచే అవకాశముంది. ఇష్యూ నిర్వహించేందుకు(అండర్‌రైటింగ్) సిటీగ్రూప్, డాయిష్ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ తదితర సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ ఇష్యూ ఊహించినదానికంటే అధిక విలువను సాధించే అవకాశమున్నదని, తద్వారా టెక్నాలజీ పరిశ్రమలో రెండో అతిపెద్ద ఇష్యూగా నిలవవచ్చునని పేర్కొన్నాయి. ఈబే, అమెజాన్ కలిపితే... ఈ కామర్స్ దిగ్గజాలు ఈబే, అమెజాన్.కామ్ల సంయుక్త బిజినెస్‌కంటే అలీబాబా వ్యాపారమే అధికంకావడం విశేషం. సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది పనిచేస్తున్నారు. చైనా ఈ కామర్స్ మార్కెట్లో 80% వాటా కంపెనీదే. అలీబాబాలో 37% వాటాతో సాఫ్ట్‌బ్యాంక్, 24% వాటా కలిగిన యాహూ అతిపెద్ద వాటాదారులుగా ఉన్నాయి. అలీబాబా వ్యవస్థాపకులు, కొంతమంది సీనియర్ మేనేజర్లకు కలిపి 13% వరకూ వాటా ఉంది.