హౌసింగ్ డాట్ కామ్ లోకి సాఫ్ట్ బ్యాంక్ మరో 100 కోట్లు
న్యూఢిల్లీ: రియల్టీ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్‌లో జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ తాజాగా మరో రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఆన్‌లైన్ ప్రాపర్టీ విభాగంలో స్థానం పటిష్టం చేసుకునేందుకు, మరింత వృద్ధి ప్రణాళికల అమలుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు హౌసింగ్‌డాట్‌కామ్ సీఈవో జేసన్ కొఠారి తెలిపారు. గృహాల కొనుగోలు, విక్రయాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు.
2012లో ప్రారంభమైన ఈ సంస్థ.. నెక్సస్ వెంచర్స్, ఫాల్కన్ ఎడ్జ్, హీలియోన్ వెంచర్స్ మొదలైన వాటి నుంచి 100 మిలియన్ డాలర్లదాకా సమీకరించింది. ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్‌కి ఇందులో 30 శాతం వాటాలు ఉన్నాయి. తాజా పెట్టుబడుల అనంతరం సాఫ్ట్‌బ్యాంక్ వాటాలు మరింత పెరిగే అంశానికి సంబంధించిన వివరాలేమీ వెల్లడి కాలేదు. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హౌసింగ్‌డాట్‌కామ్ తన స్థానాన్ని పటిష్టపర్చుకోగలదని కంపెనీ బోర్డులో డెరైక్టరుగా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి జొనాథన్ బులక్ పేర్కొన్నారు.