Govt Asks Swiggy, Zomato And Others To Submit Plans In 15 Days For On Improving The Consumer - Sakshi
Sakshi News home page

ఏంటీ మీ తొక్కలో సర్వీస్‌.. ఇలాగైతే కుదరదు మరి..

Published Tue, Jun 14 2022 2:28 PM | Last Updated on Tue, Jun 14 2022 3:50 PM

Centre Show Angry On Poor Service of Swiggy and Zomato - Sakshi

ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీస్‌ అందిస్తు‍న్న జొమాటో, స్విగ్గీ ఇతర ఈ కామర్స్‌ సంస్థలపై కేంద్రం కన్నెర్ర చేసింది. మీ సర్వీసులు బాగాలేవంటూ మాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయ్‌. అసలు కస్టమర్ల సమస్యలు పరిష్కరించేందుకు మీరు అవలంభిస్తున్న విధానాలు ఏంటీ ? మరింత మెరుగ్గా సేవలు ఎలా అందివ్వగలరో మాకు తెలపండి అంటూ వాటికి ఆదేశాలు జారీ చేసింది. నివేదిక అందించేందుకు 15 రోజుల గడువు విధించింది.
 

ఈ కామర్స్‌ సర్వీసుల్లో లోపాలపై గత ఏడాది కాలంలో  నేషనల్‌ కన్సుమర్‌ హెల్ప్‌లైన్‌కి ఏకంగా 3,631 ఫిర్యాదులు అందాయి. ఇందులో జోమాటో, స్విగీపై 2,828 ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసింది కన్సుమర్‌ ఎఫైర్స్‌ శాఖ. ఇందులో ముఖ్యంగా సర్వీసుల్లో లోపాలపై  స్విగ్గీ, జోమాటోలను నిలదీసింది. ఫుడ్‌ సర్వీసులపై ఎందుకు ఈ స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయంటూ ప్రశ్నించింది. చివరకు ఫిర్యాదుల పరిష్కారం, సేవల్లో లోపాలు సవరించే అంశంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కన్సుమర్‌ ఎఫైర్స్‌ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: ఆఫీస్‌లో కొత్త రూల్‌.. ఒక నిమిషం లేట్‌గా వస్తే పది నిమిషాల అదనపు పని!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement