ఎప్పటికప్పుడు వస్తువలపై ఆఫర్లు, డిస్కౌంట్లతో ప్రజలను ఆకట్టుకుంటూ ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతోంది ప్రముఖ సంస్థ ఫ్లిప్‌కార్ట్. తాజాగా తన కస్లమర్ల కోసం మరో సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. గతేడాది తాను కొనుగోలు చేసిన ట్రావెల్ వెబ్‌సైట్ క్లియర్‌ట్రిప్(Cleartrip) భాగస్వామ్యంతో ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ (Flipkart Hotels) పేరిట హోటల్ బుకింగ్ సేవను కొత్తగా ప్రారంభించింది. తద్వారా ట్రావెల్ విభాగంలోనూ అడుగుపెట్టింది.
ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు 3 లక్షల దేశీయ, అంతర్జాతీయ హోటళ్లలో సమాచారం ఉందని, వీటి ద్వారా తమ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. తన కస్టమర్ల కోసం ట్రావెల్, బుకింగ్స్‌కు సంబంధించి కొత్త ఆఫర్లతో పాటు, ఈఎంఐ (EMI) ఆప్షన్లు, ఫ్రెండ్లీ బడ్జెట్ వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. కొవిడ్ ఆంక్షలు ముగిసినప్పటి నుంచి దేశంలో పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత రెండేళ్లలో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో ఈ రంగం మెరుగైన వృద్ధినే సాధించింది. రానున్న రోజుల్లో ఈ పరిశ్రమ మరింత మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంచనా. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నిస్తోంది.
చదవండి: మీ భవిష్యత్తుకు భరోసా.. ఎల్‌ఐసీ నుంచి కొత్త పెన్షన్ పాలసీ, బెనిఫిట్స్ కూడా బాగున్నాయ్
Comments
Please login to add a commentAdd a comment