హీరోయిన్‌కి షాక్‌ ఇచ్చిన అమెజాన్‌ | Sonakshi Sinha Gets A Piece of Junk on Ordering Headphones | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 14 2018 12:30 PM | Last Updated on Fri, Dec 14 2018 12:31 PM

Sonakshi Sinha Gets A Piece of Junk on Ordering Headphones - Sakshi

ఆన్‌లైన్‌ బిజినెస్‌లు పెరుగుతున్న కొద్ది మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఏదైన వస్తువు బుక్‌ చేసిన వారికి ఆ వస్తువులకు బదులు రాళ్లు, సబ్బులు లాంటవి రావటం మనం తరుచూ వార్తల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌కు ఎదురైంది. సోనాక్షి సిన్హా అమెజాన్‌లో బోస్‌ కంపెనీ ఇయర్‌ ఫోన్స్‌ బుక్‌ చేశారు. అయితే ఆ ప్యాక్‌ ఇయర్‌ ఫోన్స్‌కు బదులు ఓ ఇనుప ముక్క ఉండటంతో సోనాక్షి షాక్‌కు గురయ్యారు.

ఈ విషయంపై అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసిన వారు సరిగ్గా స్పందించకపోవటంతో ఆమె సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని షేర్‌ చేశారు. ‘అమెజాన్‌.. నేను బోస్‌ ఇయర్‌ఫోన్స్‌ ఆర్డర్ చేస్తే ఏమో వచ్చాయో చూడండి. బయటకు బాక్స్‌ మంచి ప్యాక్‌ చేసిన నీట్‌గా సీల్‌వేసి ఉంది. మీ కస్టమర్‌ సర్వీస్‌ కూడా సాయం చేసేందుకు సిద్ధంగా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈవిషయంపై స్పందించిన అమెజాన్‌, సోనాక్షిని క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేయటంతో పాటు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement