నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్! | demonitisation effect: nearly 4 lakh jobs may go | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!

Published Fri, Dec 9 2016 12:23 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్! - Sakshi

నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు హాంఫట్!

పెద్దనోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి 1 శాతం తగ్గిపోతుందని, దాంతో వచ్చే సంవత్సరం దాదాపు 4 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ-కామర్స్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు పోవచ్చని, రాబోయే సంవత్సర కాలంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు పోవచ్చని అంటున్నారు. ఈ కామర్స్ రంగంలో దాదాపు 70 శాతం వరకు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలోనే జరుగుతాయని, కానీ ఇప్పుడు ప్రజల వద్ద నగదు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో చాలావరకు లావాదేవీలు మానుకుంటారని, అసలు వ్యాపారమే జరగనప్పుడు ఈ కామర్స్‌ రంగంలో అంతమంది ఉద్యోగులు అక్కర్లేదు కాబట్టి ప్రధానంగా డెలివరీ రంగంలోని వాళ్లకు చాలావరకు ఉద్యోగాలు పోతాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కసహ వ్యవస్థాపకురాలు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ కామర్స్ రంగంలో మొత్తం 10 లోల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
అలాగే, లగ్జరీ వస్తువులను తయారుచేసి, అమ్మే కంపెనీలపై కూడా తక్షణ ప్రభావం కనిపిస్తుందని, ఇప్పటికప్పుడు అవసరం లేని లగ్జరీల మీద పెట్టే ఖర్చును ప్రజలు వెంటనే మానుకుంటారని రితుపర్ణ విశ్లేషించారు. ఇక రియల్ ఎస్టేట్, నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలపై కూడా పెద్దనోట్ల ప్రభావం గట్టిగానే పడేలా ఉంది. ఈ రంగాల్లో రాబోయే ఏడాది కాలంలో దాదాపు లక్ష ఉద్యోగాలు పోతాయని కన్సల్టింగ్, నియామక సంస్థలు అంచనా వేస్తున్నాయి. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాలు పోవడం, నియామకాలు తగ్గడం లాంటివి చూస్తామంటున్నారు. 
 
చేనేత వస్త్ర రంగాలలో చాలామంది దినసరి వేతనాల మీద పనిచేస్తారని, వాటి మీద కూడా నోట్ల రద్దు ప్రభావం గట్టిగానే పడుతుందని అంటున్నారు. ఈ పరిశ్రమలో మొత్తం 3.2 కోట్ల మంది పనిచేస్తుండగా, వాళ్లలో ఐదోవంతు దినసరి వేతన కార్మికులేనని, వస్త్రాల అమ్మకాలు తగ్గడంతో ఉత్పత్తులు తిరిగి రావడం, దానివల్ల దినసరి వేతన కార్మికులకు ఉద్యోగాలు పోవడం లాంటివి సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. తోలు పరిశ్రమలోని మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులలో 20 శాతం మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement