పెద్దనోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి 1 శాతం తగ్గిపోతుందని, దాంతో వచ్చే సంవత్సరం దాదాపు 4 లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఈ-కామర్స్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు పోవచ్చని, రాబోయే సంవత్సర కాలంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు పోవచ్చని అంటున్నారు. ఈ కామర్స్ రంగంలో దాదాపు 70 శాతం వరకు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలోనే జరుగుతాయని, కానీ ఇప్పుడు ప్రజల వద్ద నగదు ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో చాలావరకు లావాదేవీలు మానుకుంటారని, అసలు వ్యాపారమే జరగనప్పుడు ఈ కామర్స్ రంగంలో అంతమంది ఉద్యోగులు అక్కర్లేదు కాబట్టి ప్రధానంగా డెలివరీ రంగంలోని వాళ్లకు చాలావరకు ఉద్యోగాలు పోతాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కసహ వ్యవస్థాపకురాలు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ కామర్స్ రంగంలో మొత్తం 10 లోల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
Published Sat, Dec 10 2016 7:51 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement