క్విక్‌ కామర్స్‌..ఫ్యాషన్‌ షో! | Quick Commerce Platforms Exploring Deals | Sakshi
Sakshi News home page

క్విక్‌ కామర్స్‌..ఫ్యాషన్‌ షో!

Published Tue, Aug 20 2024 6:19 AM | Last Updated on Tue, Aug 20 2024 8:02 AM

Quick Commerce Platforms Exploring Deals

దుస్తులు, షూస్‌ వంటి ఫ్యాషన్‌ ప్రోడక్టుల డెలివరీకి సై...

ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, జెప్టోతో కంపెనీల జట్టు

జాబితాలో అడిడాస్, ప్యూమా, మాన్యవర్‌...

త్వరలో అరవింద్, ఫ్యాబ్‌ ఇండియా, ఉడ్‌ల్యాండ్, బాటా కూడా

కిరాణా సరుకులు.. కూరగాయలు.. మిల్క్‌ ప్రోడక్టులు.. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను 15 నిమిషాల్లో గుమ్మంలోకి చేరుస్తూ... శరవేగంగా దూసుకుపోతున్న క్విక్‌ కామర్స్‌ మరిన్ని ఉత్పత్తులను కార్ట్‌లోకి చేరుస్తోంది. నగరాల్లో సూపర్‌ సక్సెస్‌ నేపథ్యంలో అపారెల్, ఫుట్‌వేర్‌ కంపెనీలు దీనిపై ఫోకస్‌ చేస్తున్నాయి. ఫాస్ట్‌ సెల్లింగ్‌ జాబితాలో ముందున్న దుస్తులు, షూస్‌ ఇతరత్రా ఫ్యాషన్‌ ప్రోడక్టులను సైతం క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విక్రయించేందుకు సై అంటున్నాయి.

జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో.. ఈ క్విక్‌ కామర్స్‌ స్టార్టప్‌లు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవలే ఫ్యాషన్‌ ప్రోడక్టుల అమ్మకాలు మొదలు పెట్టడంతో కస్టమర్లకు మరిన్ని రకాలు ప్రోడక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. జాకీ, అడిడాస్‌ బ్రాండ్స్‌కు చెందిన బేసిక్‌ కలర్‌ టీ–షర్టులు, ఇన్నర్‌వేర్‌ వంటి ఉత్పత్తులను ఇన్‌స్టామార్ట్‌ సేల్‌ చేస్తోంది. 

ఇక బ్లింకిట్‌ జాకీ, పెపే, అడిడాస్‌ టీ–షర్ట్స్, కొన్ని రకాల ఫుట్‌వేర్, ట్రాక్‌ ప్యాంట్లతో పాటు లోదుస్తులను ఆఫర్‌ చేస్తోంది. జెప్టో కూడా నేను సైతం అంటూ రంగంలోకి దూకింది. దీంతో మరిన్ని ఆపారెల్, ఫుట్‌వేర్‌ బ్రాండ్స్‌ క్విక్‌ కామర్స్‌ అండతో అమ్మకాలు పెంచుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాయి. అరవింద్‌ ఫ్యాషన్స్, ఫ్యాబ్‌ ఇండియా, ఉడ్‌ల్యాండ్‌తో పాటు ప్యూమా తదితర దిగ్గజాలు క్విక్‌ కామర్స్‌ కంపెనీలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచి్చనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. దేశంలోని 15 టాప్‌ నగరాల్లో కస్టమర్లు తమ నిత్యావసరాల కోసం క్విక్‌ కామర్స్‌ బాట పడుతున్నారు. దీంతో మరింత మందిని బుట్టలో వేసుకోవాలని చూస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లు గ్రాసరీలు, ఎఫ్‌ఎంసీజీకి మించి తమ పరిధిని విస్తరించడంపై ఫోకస్‌ చేస్తున్నాయి. 

ఆ రెండు విభాగాలపై గురి...  
ప్రస్తుతం భారత ఈ–కామర్స్‌లో మార్కెట్లో ఎల్రక్టానిక్స్‌–స్మార్ట్‌ ఫోన్స్‌ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్నది ఫ్యాషన్‌ ఉత్పత్తులే. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 20–25 శాతంగా అంచనా. దీంతో ఫ్యాషన్‌ ప్రోడక్టుల అమ్మకం అటు బ్రాండ్‌లతో, ఇటు క్విక్‌ కామర్స్‌ సంస్థలకు ఉభయతారకంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఎల్రక్టానిక్స్‌–స్మార్ట్‌ ఫోన్స్‌ విభాగంలోకి కూడా దూకేందుకు ఈ స్టార్టప్‌లు ఉవి్వళ్లూరుతున్నాయి. యారో, కాలి్వన్‌ క్లీన్, టామీ హిలి్ఫగర్, యూఎస్‌ పోలో వంటి టాప్‌ బ్రాండ్‌లను విక్రయించే అరవింద్‌ ఫ్యాషన్స్‌.. క్విక్‌ కామర్స్‌ ద్వారా ముందుగా టీ–షర్ట్‌లు, ఇన్నర్‌వేర్‌తో పాటు బెల్టులు, సాక్స్‌ల వంటి యాక్సెసరీలను క్విక్‌ కామర్స్‌లో విక్రయించనుంది. 

ఐపీఎల్‌ సీజన్‌లో టీమ్‌ జెర్సీలను ఈ ప్లాట్‌ఫామ్‌లలో జోరుగా విక్రయించిన ప్యూమా... ఇతర ప్రోడక్టులకు సైతం తమ భాగస్వామ్యాన్ని విస్తరించే సన్నాహాల్లో ఉంది. ‘ఇన్‌స్టంట్‌ డెలివరీని ఎంచుకుంటున్న వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫ్యాషన్‌ రంగంలో కూడా క్విక్‌ కామర్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ–కామర్స్‌లో మా కంపెనీ సేల్స్‌ 30 శాతానికి చేరుకున్నాయి’ అని ఉడ్‌ల్యాండ్‌ ఇండియా సీఈఓ హర్కీరత్‌ సింగ్‌ చెప్పారు. రిటర్న్‌లు చాలా తక్కువగా ఉండే బేసిక్‌ ప్రోడక్టులను తాము ఈ ప్లాట్‌ఫామ్‌లో విక్రయించనున్నట్లు ఫుట్‌వేర్‌ సంస్థ లిబర్టీ వెల్లడించింది.  బాటా కూడా క్విక్‌ కామర్స్‌ రూట్లో వెళ్తోంది. ’10–15 నిమిషాల్లో డెలివరీ చేసేలా క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం’ అని బాటా ఇండియా సీఈఓ, ఎండీ గుంజన్‌ షా వెల్లడించారు. 

నో రిటర్న్‌ పాలసీ...
ఈ–కామర్స్‌ మాదిరిగా క్విక్‌ కామర్స్‌లో ప్రోడక్టులు నచ్చకపోతే వెనక్కి తిరిగిచ్చేందుకు రిటర్న్‌ పాలసీ లేదు. తయారీపరమైన లోపాలకు మాత్రమే నగదును రీఫండ్‌ చేస్తున్నాయి. ఫ్యాషన్‌ రంగంలో సైజ్, రంగులు ఇతరత్రా కారణాలతో రిటర్న్‌ చేసే కస్టమర్లు ఎక్కువ. దీంతో ఉడ్‌ల్యాండ్‌ వంటి బ్రాండ్‌లు తమ స్టోర్స్‌ ద్వారా రిటర్న్‌ పాలసీని అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. కాగా, వివిధ ప్రదేశాల్లోని రిటైల్‌ స్టోర్లలో స్టాక్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లకు లింక్‌ చేసి, ఎక్కువ ప్రోడక్టులను కస్టమర్లకు అందించాలనేది క్విక్‌ కామర్స్‌ సంస్థల వ్యూహం. ఎందుకంటే ఫ్యాషన్‌ ఉత్పత్తులను తమ డార్క్‌ స్టోర్లలో (వేగంగా డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసే భారీ గోదాములు) నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడం వాటికి పెద్ద సమస్య అవుతుందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అయితే, ఫాస్ట్‌ సెల్లింగ్‌ ఉత్పత్తులైన ఇన్నర్‌వేర్, సాక్సులు, వైట్, సాలిడ్‌ కలర్‌ టీ–షర్ట్‌లు, బ్లాక్‌ ట్రౌజర్లు, బ్లూజీన్స్, కుర్తాలు, ఫార్మల్‌ బ్లాక్‌ షూస్, స్కూల్‌ షూస్, ఇంట్లో వాడే స్లిప్పర్స్, వాకింగ్‌ స్నీకర్స్‌ వంటివి తమ డార్క్‌ స్టోర్లలో నిల్వ చేయడం ద్వారా 15 నిమిషాల్లోనే డెలివరీ చేయొచ్చనేది క్విక్‌ కామర్స్‌ కంపెనీల యోచన.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement