అమ్మకాల్లో దుమ్మురేపిన ఈ-కామర్స్‌ సంస్థలు..! | FMCG Sales Via E Commerce Touched Double Digits In May | Sakshi
Sakshi News home page

అమ్మకాల్లో దుమ్మురేపిన ఈ-కామర్స్‌ సంస్థలు..!

Published Fri, Aug 13 2021 4:37 PM | Last Updated on Fri, Aug 13 2021 4:45 PM

FMCG Sales Via E Commerce Touched Double Digits In May - Sakshi

కోవిడ్‌-19 రాకతో పలు వ్యాపార సంస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. కోవిడ్‌-19 రాకతో ఫాస్ట్‌ మూవింగ్‌ కస్యూమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎమ్‌సీజీ) కంపెనీలు, ఈ-కామర్స్‌ సంస్థలు గణనీయంగా వృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస లాక్‌డౌన్‌లు పలు ఆన్‌లైన్‌ కిరాణా సంస్థలకు భారీ ప్రయోజనాన్నిచేకూర్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్‌ సంస్థలపై మొగ్గుచూపాయి. 

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ-కామర్స్‌ సంస్థలు ద్వారా కిరాణా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని​ మార్కెట్‌ పరిశోధన సంస్థ నిల్సన్‌ఐక్యూ పేర్కొంది.కోవిడ్‌ రాక ముందు 2020 సంవత్సరంలో ఈ-కామర్స్‌ అమ్మకాలు 96 శాతంగా ఉండగా  కోవిడ్‌ రాకతో 134 శాతానికి గణనీయంగా అమ్మకాలు వృద్ధి చెందాయి. దీంతో మే నెలలో  ఈ-కామర్స్‌ సంస్థలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్‌ 52 మెట్రో నగరాల్లో ఎఫ్‌ఎంసిజి అమ్మకాలు ఈ-కామర్స్‌ సహకారంతో 2021 మే నెలలో రెండంకెల మార్కును వృద్ధిని నమోదు చేశాయి.

ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల వృద్ధి కొనసాగుతూనే ఉందని నీల్సన్‌ఐక్యూ కస్టమర్‌ సక్సెస్‌ లీడ్‌ సమీర్‌ శుక్లా వెల్లడించారు. వినియోగదారుల ఆకాంక్షలను పూర్తి చేయడంలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలకు ఈ-కామర్స్‌ కంపెనీలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ-కామర్స్‌ సంస్థల సహయంతో ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల సేల్స్‌లో మారికో లిమిటెడ్‌  9 శాతం, హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ 6 శాతంగా వృద్ధి చెందాయి. కాగా మరోవైపు గ్రాసరీ స్టోర్ల పరిస్థితి దయానీయంగా మారింది. ప్రజలు ఎక్కువగా గ్రాసరీ స్టోర్లవైపు కాకుండా ఈ-కామర్స్‌ సంస్థల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని నిల్సన్‌ఐక్యూ పేర్కొంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement