nielsen survey
-
NielsenIQ: ‘మాల్స్’ విక్రయాల్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారా విక్రయాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక అంగళ్లలో ఎఫ్ఎంసీజీ, టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాల పరంగా రెండంకెల వృద్ధి చూపిస్తున్న ఏకైక దేశం భారత్ అని.. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, పండుగల విక్రయాలు ఇందుకు సాయపడుతున్నట్టు పేర్కొంది. 40 శాతం ఎఫ్ఎంసీజీ అమ్మకాలు, 30 శాతం టెక్నాలజీ డ్యూరబుల్స్ విక్రయాలు ఆధునిక వాణిజ్య ఛానళ్ల ద్వారానే నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఇది భారత వినియోగదారుల ప్రాధాన్యతలను తెలియజేస్తున్నట్టు నీల్సన్ ఐక్యూ నివేదిక పేర్కొంది. ఆన్లైన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నా కానీ, భారత వినియోగదారులకు ఆధునిక అంగళ్లు (సూపర్ మార్కెట్లు, హైపర్ మార్కెట్లు, డిపార్ట్మెంట్ స్టోర్లు) ప్రాధాన్య మార్గాలుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆధునిక వాణిజ్యం బలంగానే నమోదైంది. ధరల అస్థిరతలు ఉన్నప్పటికీ రండంకెల వృద్ధి నమోదైంది. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది’’అని ఈ నివేదిక వివరించింది. ఎఫ్ఎంసీజీ, టెక్ డ్యూరబుల్స్ విక్రయాలకు పండగల సీజన్ కీలకమని పేర్కొంది. ఈ కాలంలోనే ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో 20 శాతం, టెక్నాలజీ డ్యూరబుల్స్ అమ్మక్లాలో 60 శాతం నమోదవుతున్నట్టు తెలిపింది. ఆహారోత్పత్తుల కంటే వీటి అమ్మకాలే ఆయా సీజన్లలో 1.8 రెట్లు అధికంగా ఉంటున్నట్టు పేర్కొంది. చిన్న తయారీ సంస్థల ఉత్పత్తులతోపాటు, రిటైలర్లు సొంతంగా నిర్వహించే ప్రైవేటు లేబుల్స్ రూపంలో పెద్ద కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రైవేటు లేబుళ్ల అమ్మకాలు పెద్ద తయారీ సంస్థల ఉత్పత్తులతో పోలి్చతే ప్రవేటు లేబుళ్ల అమ్మకాలు (రిటైల్ సంస్థల సొంత ఉత్పత్తులు) 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక చిన్న తయారీ సంస్థలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో 70 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి’’అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలిపింది. ఆధునిక చానళ్లలో సంప్రదాయంగా ఎఫ్ఎంసీజీలకు సంబంధించి పెద్ద ప్యాక్‌లకు ఆదరణ ఉంటుండగా, ఇది క్రమంగా చిన్న ప్యాక్‌ల వైపు మళ్లుతున్నట్టు వివరించింది. -
SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్‌లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది. స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్‌వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా? అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్రూమ్ లేకపోవడం, గుర్గుర్మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్‌గా మారింది. మనిషికి కావలసింది ఆ రెండే ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి. లండన్‌లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్‌లో జెడ్వెల్ అనే హోటల్ ‘సౌండ్‌ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి. స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట. మంచి పరుపులు, మసాజ్‌లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్‌కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్‌లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్‌లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్‌లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. -
పుంజుకుంటున్న ఎఫ్ఎంసీజీ రంగం!
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ పరిశ్రమ జూన్ త్రైమాసికంలో మోస్తరు వృద్ధిని చూసింది. విలువ పరంగా వ్యాపారం 10.9 శాతం పెరిగింది. ఆహారేతర వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో తగినప్పటికీ.. మొత్తం మీద వినియోగం పెరగడం కలిసొచ్చింది. డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం మీద వినియోగం మళ్లీ పుంజుకుంటున్నట్టు పేర్కొంది. త్రైమాసికం వారీగా చూస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్లో యూనిట్ పరిమాణం పెరిగిందని, వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు తగ్గినట్టు వివరించింది. పరిమాణం పరంగా సానుకూల ధోరణి ఉండొచ్చని, దీనికితోడు ధరల ఆధారిత వృద్ధి కూడా ఉంటుందని అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో రెండంకెల వృద్ధి నమోదైనట్టు నీల్సన్ ఐక్యూ ఎండీ సతీష్ పిళ్లై (భారత్) చెప్పారు. గత ఐదు త్రైమాసికాలుగా రెండంకెల స్థాయిలో ధరల పెరుగుదలను చూస్తున్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణం, ఇతరస్థూల ఆర్థిక గణాంకాలను ప్రస్తావించారు. ఎఫ్ఎంసీజీలో ఈ ఏడాది రెండంకెల వృద్ధి నమోదవుతుందని నీల్సన్ఐక్యూ అంచనా వేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రికవరీ కనిపిస్తోందని.. కొంత నిదానంగా అయినా గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగం పెరగొచ్చని అంచనా వేసింది. రూ.100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న కంపెనీలు జూన్ త్రైమాసికంలో విక్రయాల పరంగా వృద్ధిని నమోదు చేశాయి. చదవండి👉 'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో! -
మందగమనంలో ఎఫ్ఎంసీజీ!
న్యూఢిల్లీ: భారత ఎఫ్ఎంసీజీ రంగం మందగమన పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2021లో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ వినియోగం తగ్గుముఖం పట్టగా, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా క్షీణతను చూవిచూసినట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ ఐక్యూ తెలిపింది. అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు కంపెనీలు ధరల పెంపును చేపట్టాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లేలా చేసినట్టు పేర్కొంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకునేందుకు 2021లో వరుసగా మూడు త్రైమాసికాల్లో రెండంకెల స్థాయిలో ధరలను పెంచినట్టు తెలిపింది. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గిపోగా.. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధికి బదులు క్షీణతకు దారితీసినట్టు పేర్కొంది. 2021 చివరి త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగా విక్రయాలు మైనస్ 2.6 శాతంగా ఉన్నట్టు వివరించింది. ‘‘ఎఫ్ఎంసీజీ కంపెనీల విక్రయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతంగా ఉంది. కరోనా రెండో విడత కంపెనీలపై ఎక్కువ ప్రభావం చూపించింది. గత డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌యూఎల్ గణాంకాలను పరిశీలించినా గ్రామీణ మార్కెట్ల విక్రయాలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ధరల పెంపు చిన్న తయారీ దారులపై ప్రభావం చూపిస్తుంది. అధిక వ్యయాలను వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితుల్లో రూ.100 కోట్లు, అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీల అమ్మకాలు 13 శాతం తగ్గాయి’’ అని నీల్సన్ ఐక్యూ నివేదిక తెలియజేసింది. అదే సమయంలో మధ్యస్థ, పెద్ద కంపెనీలు స్థిరమైన పనితీరు చూపించినట్టు పేర్కొంది. గడిచిన రెండేళ్లలో కొత్తగా 8 లక్షల ఎఫ్ఎంసీజీ స్టోర్లు తెరుచుకున్నాయని.. ఇందులో సగం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు అయినట్టు వెల్లడించింది. -
అమ్మకాల్లో దుమ్మురేపిన ఈ-కామర్స్ సంస్థలు..!
కోవిడ్-19 రాకతో పలు వ్యాపార సంస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. కోవిడ్-19 రాకతో ఫాస్ట్ మూవింగ్ కస్యూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు గణనీయంగా వృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస లాక్డౌన్లు పలు ఆన్లైన్ కిరాణా సంస్థలకు భారీ ప్రయోజనాన్నిచేకూర్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్ సంస్థలపై మొగ్గుచూపాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ-కామర్స్ సంస్థలు ద్వారా కిరాణా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ పరిశోధన సంస్థ నిల్సన్ఐక్యూ పేర్కొంది.కోవిడ్ రాక ముందు 2020 సంవత్సరంలో ఈ-కామర్స్ అమ్మకాలు 96 శాతంగా ఉండగా కోవిడ్ రాకతో 134 శాతానికి గణనీయంగా అమ్మకాలు వృద్ధి చెందాయి. దీంతో మే నెలలో ఈ-కామర్స్ సంస్థలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 52 మెట్రో నగరాల్లో ఎఫ్ఎంసిజి అమ్మకాలు ఈ-కామర్స్ సహకారంతో 2021 మే నెలలో రెండంకెల మార్కును వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్ఎమ్సీజీ కంపెనీల వృద్ధి కొనసాగుతూనే ఉందని నీల్సన్ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సమీర్ శుక్లా వెల్లడించారు. వినియోగదారుల ఆకాంక్షలను పూర్తి చేయడంలో ఎఫ్ఎమ్సీజీ కంపెనీలకు ఈ-కామర్స్ కంపెనీలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ-కామర్స్ సంస్థల సహయంతో ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ కంపెనీల సేల్స్‌లో మారికో లిమిటెడ్ 9 శాతం, హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ 6 శాతంగా వృద్ధి చెందాయి. కాగా మరోవైపు గ్రాసరీ స్టోర్ల పరిస్థితి దయానీయంగా మారింది. ప్రజలు ఎక్కువగా గ్రాసరీ స్టోర్లవైపు కాకుండా ఈ-కామర్స్ సంస్థల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని నిల్సన్ఐక్యూ పేర్కొంది. -
మొబైల్స్‌దే మెజారిటీ వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఈ–కామర్స్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్లైన్ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే–జూలైతో పోలిస్తే ఆగస్టు–అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్లైన్ కస్టమర్ల షాపింగ్ తీరును ఈ నివేదికలో వివరించింది. కొత్త కస్టమర్లకు మొబైల్స్ తొలి ప్రాధాన్యతగా నిలిచింది. 28 సెప్టెంబరు–25 అక్టోబరు మధ్య ఫెస్టివ్ పీరియడ్‌లో వీరు ఖర్చు చేసిన మొత్తం విలువలో మొబైల్స్ వాటా ఏకంగా 53% ఉంది. అధిక ఆర్డర్లు ఎఫ్ఎంసీజీలో.. 2019 మే–ఆగస్టు కాలంలో జరిగిన షాపింగ్‌లో విలువ పరంగా మొబైల్స్ 48 శాతం, ఫ్యాషన్ 16 శాతం కైవసం చేసుకున్నాయి. ఇక అత్యధిక ఆర్డర్లు (పరిమాణం) ఎఫ్ఎంసీజీ విభాగంలో 56 శాతం చోటుచేసుకోవడం విశేషం. ఎఫ్ఎంసీజీలో ఎక్కువ ఆర్డర్లు 50 లక్షలు ఆపై జనాభా ఉన్న మెట్రో నగరాల నుంచే వస్తున్నాయి. 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రథమ శ్రేణి నగరాల నుంచి మొబైల్ ఫోన్ల కోసం 50 శాతం ఆర్డర్లు వస్తే.. మెట్రోల నుంచి ఇది 38 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫ్యాషన్ విభాగంలో మే–అక్టోబరు మధ్య నాలుగింట మూడు భాగాలు దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి. షాపింగ్ రాత్రిపూటే.. మొబైల్స్ తర్వాత ఫ్యాషన్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ వంటివి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్ల విషయంలో రెండు, మూడవసారి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌కు నూతన వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఫెస్టివల్ సీజన్లో ప్రైమ్ టైంలో అంటే రాత్రి 8–11 గంటల మధ్య అత్యధికంగా 23 శాతం షాపింగ్ జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 17 శాతం షాపింగ్ నమోదైంది. పండుగల సమయంలో మూడు నాలుగు రెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండిపెండెన్స్ డే సేల్ తర్వాత సాధారణంగా నమోదైన విక్రయాలు తిరిగి ఫెస్టివ్ పీరియడ్ వచ్చే సరికి అనూహ్యంగా ఎగబాకాయి. 28 సెప్టెంబరుతో మొదలైన ఫెస్టివ్ సీజన్ తొలి వారంలో 43 శాతం సేల్స్ జరిగాయి. -
పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..
పురుషులతో సమానంగా మహిళలూ తమ శక్తి సామర్థ్యాలను చాటుకుంటున్నారు. సొంతంగా వ్యాపారాలను సృష్టిస్తున్న వారు... ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్న వారు... వ్యాపార సామ్రాజ్యాలను ఒంటిచేత్తో నడిపిస్తున్న వారు... ఎందరో ఉన్నారు. అయితే, ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలకు వచ్చే సరికి వారిలో ఎక్కడో తటపటాయింపు..! పెట్టుబడి నిర్ణయాల్లో పురుషులతో సమానంగా రాణించే సామర్థ్యాలు ఉన్నా కానీ, వనితలు చొరవగా ముందుకు రావడం లేదని డీఎస్పీ విన్వెస్టర్ పల్స్ సర్వే ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. మన దేశంలో మగవారితో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్న స్త్రీలు సగం మందేనట. ఇలా ముందుకు వచ్చే వారి వెనుక వారి భర్తల ప్రోత్సాహమే ప్రధాన కారణంగా ఉంటోంది. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే స్త్రీల వెనుక ప్రోత్సాహం అందించేవారిలో తల్లిదండ్రుల కంటే జీవిత భాగస్వాముల సంఖ్యే అధికంగా ఉంది. కొందరు తమంతట తామే ఉత్సాహంగా ముందుకు వస్తుంటే, కొందరు మాత్రం తప్పనిసరై ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు డీఎస్పీ విన్వెస్టర్ పల్స్ 2019 సర్వే పేర్కొంది. చిన్న వయస్సు నుంచి ఇన్వెస్టింగ్ పాఠాలు... ‘సీనియర్ స్థాయి నిపుణులు, ఫండ్ మేనేజర్లలోనూ మహిళలు ఉన్నప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లుగా మహిళలు పెద్దగా ముందుకురాకపోవడం ఆశ్చర్యకరమైన అంశమని’’ డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రెసిడెంట్ కల్పే¯Œ పారిక్ తెలిపారు. ‘‘మహిళల్లో ఎక్కువ మంది తల్లిదండ్రుల కంటే భర్తల నుంచే ఎక్కువ ప్రోత్సాహం పొందుతుండటం గమనించాల్సిన విషయం. తమ కుమార్తెలకు చిన్న వయసు నుంచే ఇన్వెస్టింగ్ గురించి నేర్పాలని తండ్రులకు నా మనవి. ఇన్వెస్టింగ్ విషయంలో మహిళలు ముందే విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని మా సర్వే ఎత్తిచూపుతోంది’’ అని డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సేల్స్, మార్కెటింగ్ హెడ్ అదితి కొఠారి తెలిపారు. సర్వే ఇలా... పరిశోధనా సంస్థ నీల్సన్ తో కలసి డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఈ సర్వే నిర్వహించింది. డబ్బు విషయాల్లో వారి లక్ష్యాలు, వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఇన్వెస్ట్మెంట్, వారసత్వం విషయాల్లో మహిళలు, పురుషుల ప్రవర్తనను ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా 8 పట్టణాల్లో 4,013 మంది మహిళలు, పురుషుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. మెట్రో నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరుతోపాటు ఇండోర్, కొచ్చి, లూధియానా, గువాహటి పట్టణాలను ఈ సర్వే కవర్ చేసింది. మొత్తం 4,013 మందిలో 1,853 మంది మగవారు కాగా, 2,160 మంది స్త్రీలు. 25–60 ఏళ్ల వయసు గ్రూపులోని వారే వీరంతా. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారు లేదా గతంలో కనీసం 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన వారు, అవివాహితులు, వివాహితులు, పిల్లల్లేని వారు లేదా పెళ్లయి పిల్లలు ఉన్న వారు కూడా ఇందులో ఉన్నారు. మహిళలు తమ పెట్టుబడి నిర్ణయాల బాధ్యతలను తీసుకునే దిశగా వారిని ప్రోత్సహించడం, వారిలో నమ్మకాన్ని ప్రోది చేయడం ద్వారా తమ ఆర్థిక విషయాల నిర్వహణకు మరొకరిపై ఆధారపడే పరిస్థితి లేకుండా చూడటమే ఈ సర్వే ఉద్దేశమని డీఎస్పీ విన్వెస్టర్ పల్స్ సర్వే పేర్కొంది. లక్ష్యాలు తమ వారసుల విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, రుణాల్లేని జీవితం, అత్యున్నత ప్రమాణాలతో కూడిన జీవితం ఈ లక్ష్యాలు పురుషులు, స్త్రీలకు ఒకే తీరులో ఉన్నాయి. తమ పిల్లలకు సంబంధించిన లక్ష్యాల్లో పురుషులతో పోలిస్తే స్త్రీలకే కొంత ఆసక్తి ఎక్కువగా ఉంది. మహిళల టాప్–3 లక్ష్యాల్లో మొదటి రెండు పిల్లల విద్య, వివాహాలే. పిల్లల విద్య పట్ల 34 శాతం మంది, వారి వివాహాల పట్ల 29 శాతం మంది మహిళలు ప్రాధాన్యం చూపిస్తుంటే, పురుషుల శాతం ఈ లక్ష్యాల విషయంలో 31, 26 శాతంగానే ఉంది. సొంతంగా వెంచర్ ఏర్పాటు చేయాలని 26 శాతం మంది, రిటైర్మెంట్కు ప్రణాళిక వేసుకోవాలని 23 శాతం మగవారు భావిస్తుంటే, ఈ విషయాల్లో స్త్రీలు 23 శాతం, 20 శాతంగానే ఉన్నారు. మరింత ఆసక్తి కలిగించే అంశం... ఒంటరి పురుషులతో పోలిస్తే ఒంటరి మహిళలు ఎక్కువ మంది తమకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆలోచిస్తున్నారు. పిల్లల విద్య కోసం 22 శాతం, వివాహాల కోసం 23 శాతం ఒంటరి మహిళలు ఆలోచిస్తుంటే, ఈ విషయంలో మగవారు 16 శాతం, 12 శాతంగానే ఉన్నారు. తమ లక్ష్యాలను సాధించుకోవడం, మెరుగైన జీవితం, విజయం, మెరుగైన ఆరోగ్యం విషయాల్లో స్త్రీ, పురుషులు సరిసమానంగా ఉన్నారు. ఆర్థిక విషయాల్లో మహిళల పాత్ర మార్కెట్ ఆధారిత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ తదితర పెట్టుబడుల విషయాల్లో పూర్తిగా తమదే నిర్ణయమని 12 శాతం మంది మహిళలు చెప్పారు. ఈ విషయంలో మగవారి శాతం 31. అంటే పురుషులతో పోలిస్తే మూడింట ఒకవంతుగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బంగారం, ఆభరణాల కొనుగోళ్ల విషయాల్లో తమ నిర్ణయమే ఫైనల్ అని చెప్పిన మహిళలు 28 శాతం మంది. ఈ విషయంలో మగవారు 17 శాతంగా ఉన్నారు. 39 శాతం మంది మహిళలు ముందు పెట్టుబడుల ప్రణాళిక వేసుకుని, దీనికి తగ్గట్టు నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేసుకుంటామని చెప్పారు. అంటే వారి మొదటి ప్రాధాన్యత ప్రణాళికే. ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే మహిళలు 42 శాతం కాగా, పురుషులు 46 శాతం మంది ఉన్నారు. పిల్లల పట్ల బాధ్యత తమ పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటామని 55 శాతానికి పైగా చెప్పారు. అయితే, కుమార్తెల పట్ల బాధ్యతగా ఉంటామన్న వారు 51% అయితే, కుమారుల పట్ల బాధ్యత వ్యక్తం చేసిన వారు 58% మేర ఉన్నారు. తమ కుమారులు, కుమార్తెలకు పెట్టుబడుల విషయంలో భిన్నంగా సూచిస్తామని దాదాపు 48% మంది తెలిపారు. పిల్లలు చిన్న వయసు నుంచే... కాలేజీ నుంచి లేదా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోవడాన్ని మొదలు పెట్టాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పిల్లలు 20 ఏళ్లు రాకముందే పెట్టుబడుల గురించి నేర్చుకోవాలని 65% మంది భావిస్తున్నారు. తమ సంపదను పిల్లలకు పంచుతామని అత్యధికంగా 76% మంది చెప్పారు. తమ వారసత్వ సంపదను కుమారులు, కుమార్తెలకు సమానంగా పంచుతామని 65% మంది చెప్పారు. మిగిలిన వారు కుమార్తెల కంటే కుమారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు. వీరిలో కుమారులకు 45%, కుమార్తెలకు 24% కేటాయిస్తామన్నది వారి మాట. తల్లుల్లో 22% మంది కుమారుల పట్ల ఎక్కువ మొగ్గు చూపారు. దీనికి వ్యతిరేక దిశలో తండ్రులు తమ కుమారుల (12%) కంటే కుమార్తెలకు (18%) మొగ్గు చూపారు. సర్వే హైలైట్స్ - 64 శాతం మంది మగవారు పెట్టుబడులపై నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నారు. - మహిళలు మాత్రం 33 శాతం మందే స్వీయ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. - వీరిలోనూ ముఖ్యంగా తమ భర్తల ప్రోత్సాహం కారణంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పిన వారు 33 శాతం. ఈ విషయంలో తల్లిదండ్రుల శాతం 24గానే ఉంది. -తమ భర్తలు తమను ఇన్వెస్టింగ్‌లోకి ప్రవేశించేలా చేశారని చెప్పిన వారు 40 శాతం. - తల్లిదండ్రులు తమను ఈ దిశగా అడుగులు వేయించారని చెప్పిన వారు 27 శాతం. - నిర్ణయాలు తీసుకునే మగువల్లోనూ తాము తీసుకోగలమనే నమ్మకంతోనే ఆ పనిచేస్తున్నట్టు 30 శాతం మంది చెప్పారు. - పిల్లల భవిష్యత్తు లక్ష్యాల విషయంలో తండ్రులతో పోలిస్తే తల్లుల పాత్ర ఎక్కువగా ఉండటం గమనార్హం. తల్లులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సర్వేలో అభిప్రాయాలు తెలియజేసిన వారిలో ఎక్కువ మంది మహిళలు చెప్పిన మాట... తమ పిల్లలు 20 ఏళ్లు వచ్చే నాటికి ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకోవాలని. - పెట్టుబడుల దిశగా తమను తమ తల్లిదండ్రులు అడుగులు వేయించారని 40 శాతం మగవారు చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత సహచర పనివారు తమను ఈ దిశగా నడిపించినట్టు చెప్పిన వారు 35 శాతం మంది. - 25 ఏళ్లు రాకముందే తాము పెట్టుబడులు ఆరంభించామని చెప్పిన వారు 65 శాతంగా ఉన్నారు. 25 ఏళ్లలోపే ఇన్వెస్ట్మెంట్ ఆరంభించడం సరైనదని 76 శాతం మంది చెప్పారు. ఇక స్వీయ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే 33 శాతం మంది మగువల వెనుక వారి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. తమ భర్తలు మరణించడం లేదా విడాకుల వల్ల తాము సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని 13 శాతం మంది మహిళలు చెప్పడం గమనార్హం. 30 శాతం మంది తాము సొంతంగా పెట్టుబడికి సంబంధించి నిర్ణయాలు తీసుకోగలమని చెప్పారు. ఇక?తమ పిల్లల విద్య, సొంతిల్లు, పిల్లల వివాహాలు, అప్పుల్లేని జీవితం, ఉన్నత ప్రమాణాలతో జీవించడం అనే ముఖ్యమైన లక్ష్యాల విషయంలో స్త్రీ, పురుషులు సరిసమానంగానే ఉన్నట్టు డీఎస్పీ సర్వే తెలిపింది. ఇన్వెస్ట్మెంట్ లేదా కారు లేదా ఇల్లు కొనుగోళ్ల నిర్ణయాల్లో పురుషుల ఆధిపత్యం ఉంటుంటే, బంగారం/ఆభరణాలు, రోజువారీ ఇంటి ఖర్చులు విషయంలో మహిళల పాత్ర కీలకంగా ఉంది. -
అన్నీ మంచి ‘ఆర్థిక’ శకునములే..!
• ద్వితీయార్ధం బాగుంటుంది:అసోచామ్ • అక్టోబర్‌లో ‘తయారీ’ రయ్: నికాయ్ పీఎంఐ • క్యూ3 ఉపాధి అవకాశాలపై నీల్సన్ సర్వే ధీమా న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మూడు వేర్వేరు సంస్థలు ఆశాజనక సంకేతాలను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం (2016 అక్టోబర్-2017 మార్చి) భారత్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని అసోచామ్ బిజ్‌కాన్ సర్వే పేర్కొంది. అక్టోబర్‌లో ‘తయారీ’ రంగం బాగుందని నికాయ్ పీఎంఐ పేర్కొంది. ఉపాధి అవకాశాల మెరుగుపడ్డానికి సంబంధించి 2016 క్యూ3లో ప్రపంచవ్యాప్తంగా 66 దేశాల్లో చూస్తే... భారతీయులే ఆశాజనకంగా ఉన్నట్లు నీల్సన్ సర్వే వివరించింది. అమ్మకాల్లో వృద్ధి: అసోచామ్: అమ్మకాల్లో వృద్ధి, సంస్థల సామర్థ్యం మెరుగుదల వంటి అంశాలు ద్వితీయార్థం క్రియాశీలతకు కారణమని అసోచామ్ సర్వే పేర్కొంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ అవుట్‌లుక్ ‘యూ’ టర్న్ తీసుకోడానికి కారణంగా వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది ‘టర్న్‌ఎరౌండ్’ సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో కొత్త ఆర్డర్లు: పీఎంఐ కొత్త ఆర్డర్లు, కొనుగోలు క్రియాశీలత, ఉత్పత్తి పెరగడం వల్ల అక్టోబర్‌లో తయారీ రంగం చక్కటి పనితీరును ప్రదర్శించినట్లు నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. సెప్టెంబర్‌లో 52.1 పాయింట్ల వద్ద ఉన్న సూచీ, అక్టోబర్‌లో 54.4 పాయింట్లకు పెరిగినట్లు వివరించింది. ఇది దాదాపు 22 నెలల గరిష్ట స్థాయి. దేశంలో తయారీ వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డాయనడానికి ఈ గణాంకాలు సంకేతాలుగా నిలుస్తున్నట్లు కూడా వివరించింది. ఉపాధిపై భారతీయుల విశ్వాసం: నీల్సన్ మరోవైపు ఉపాధి అవకాశాలకు సంబంధించి విశ్వాసంపై ప్రపంచ వ్యాప్తంగా 66 దేశాల్లో గ్లోబల్ ఫెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ కంపెనీ నీల్సన్ ఒక సర్వే నిర్వహించింది. ఉపాధి అవకాశాల కల్పన, పర్సనల్ ఫైనాన్స్, వ్యయాలకు సంబంధించి 2016 క్యూ3లో (జూలై-సెప్టెంబర్) ప్రపంచవ్యాప్తంగా చూస్తే... భారతీయుల్లో ప్రగాఢ సానుకూల విశ్వాసం ఉంది. ఉపాధి అవకాశాల కల్పన, పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలు కలగలిపిన వినియోగ విశ్వాస సూచీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 128 పాయింట్ల వద్ద ఉంటే, తరువాతి క్వార్టర్‌కు ఇది 133 పాయింట్లకు ఎగసింది. -
ఆ పనికే రోజుకు పదిన్నర గంటలు పోతోంది
న్యూయార్క్: స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్స్, మల్టీ మీడియా డివైసెస్, వీడియో గేమ్‌లు, రేడియోలు, డీవీడీలు, డీవీఆర్లు, టీవీల స్క్రీన్లపై మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఎవరైనా అధ్యయనం జరిపి, వాటి వివరాలను క్రోడీకరిస్తే చెప్పవచ్చు. వీటిపై అమెరికా పౌరులు మాత్రం రోజుకు సరాసరి సగటున పది గంటల 39 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారని నీల్సన్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకొని సర్వే చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి అమెరికా పౌరులు ఈ స్క్రీన్లపై వెచ్చించిన సమయం 9 గంటల, 39 నిమిషాలు. అంటే గతేడాదికి ఈ ఏడాదికి వీటిపై వెచ్చిస్తున్న సమయం గంట పెరిగింది. ఫొటోలు తీయడానికి, టెక్స్ట్ టైప్ చేయడానికి పడుతున్న సమయాన్ని ఈ పదిన్నర గంటలలోకి తీసుకోలేదు. ఎక్కువ వరకు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం వల్ల ఈ గంట సమయం పెరిగింది. నెట్ఫిక్స్, హులు లాంటి ఆన్లైన్ డిమాండ్ ద్వారా సినిమాలు చూడడం వల్ల కూడా ఇందులో కొంత సమయం పెరిగినట్లు గుర్తించారు. ఈ వివరాలేవీ తనకు ఆశ్చర్యానికి గురి చేయడం లేదని, ఎలక్ట్రానిక్ డివైసెస్ పెరుగుతుండడం వల్ల స్క్రీన్లపై మనం వెచ్చిస్తున్న సమయం పెరుగుతోందని, వచ్చే ఏడాది ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్శిటీలోని హెల్త్ సోషియాలోజి విభాగానికి చెందిన ప్రొఫెసర్ స్టీవ్ గోర్ట్మేకర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి సర్వేకు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా వెచ్చిస్తున్న సమయంపోను మిగతా సమయాన్ని మనిషి ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే తన ముఖ్యమని ఆయన అన్నారు. అమెరికాలోని పెద్దవాళ్లలో 81 శాతం మందికి స్మార్ట్ఫోన్లు ఉన్నాయని, వారు తమ స్మార్ట్ఫోన్లను వారు రోజులో సరాసరి సగటున గంటా 39 నిమిషాలు ఉపయోగిస్తున్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో ఇప్పటికీ రేడియోలు, టెలివిజన్లను ఉపయోగించడం విశేషం. 94 శాతం పెద్దవారికి అక్కడ హెచ్డీ టెలివిజన్లు అందుబాటులో ఉన్నాయి. వారు సినిమాలు, ఇతర కార్యక్రమాలను రోజుకు నాలుగున్నర గంటలపాటు టెలివిజన్‌లో వీక్షిస్తున్నారు. వారానికి 168 గంటలు. వాటిలో నిద్రకుపోయే సమయాన్ని రోజుకు ఆరు గంటల చొప్పున తీసేస్తే మిగిలే సమయం 126 గంటలు. అందులో ఆఫీసులో పనిచేసే కాలాన్ని వారానికి 40 గంటలు తీసేస్తే మిగిలే సమయం 86 గంటలు. కాలకృత్యాల నుంచి మొదలుకొని స్నానం చేసేవరకు, వంట వండుకొని తిని ఆఫీసుకు బయల్దేరే వరకు వ్యక్తిగత పనులకు రోజుకు మూడు గంటల చొప్పున వారానికి 21 గంటలను తీసేస్తే మిగిలే సమయం 65 గంటలు. రోజుకు పదిన్నర గంట బదులు పది గంటలనే స్క్రీన్లపై వెచ్చిస్తున్నామనుకొని లెక్కిస్తే దానికే వారానికి 70 గంటలు కావాలి. అంటే మిగిలే సమయమే అమెరికా పౌరులకు లేదన్నమాట. నిద్రనో, వ్యక్తిగత పనులకు వెచ్చిస్తున్న సమయాన్నో వారు ఇందుకు ఉపయోగించుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇక వ్యక్తిగల అలవాట్ల విషయానికి వస్తే వాకింగ్, జాగింగ్, స్నేహితులతో ముచ్చట్లు, వీకెండ్ పార్టీలు, పిల్లలతో గడిపేందుకు ఒక్క నిమిషం కూడా మిగలడం లేదన్న మాట. ఇలాంటి పరిస్థితుల కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆటలు, పాటలు లేకుండా పిల్లలు స్క్రీన్లకే అతుక్కు పోతుండడం వల్ల అమెరికాలో ఊబకాయం సమస్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు తరుణోపాయం కనుక్కోవాల్సిందే! -
షో మాన్
నీల్సన్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. దాదాపు 34 శాతంగా ఉన్న ఇండియన్ మెన్స్ గ్రూమింగ్ మార్కెట్‌కు ఇప్పుడు ఊపునిస్తోంది మగవాళ్ల సౌందర్యస్పృహే. ఈ మార్కెట్ పెరుగుదల వేగం మహిళల గ్రూమింగ్ మార్కెట్ వేగాన్ని అధిగమించిందట. మగాడికి ఏముందిలే ఎలా కనపడినా చెల్లిపోతుంది. ఆడది కాస్త కంటికి నదురుగా కనపడకపోతే ఎలా... ఇలాంటి పాత కాలపు భావాలకు కాలం చెల్లిందిక. ఇప్పుడు అందాల వేటలో ఆడవారిని ఆవలకు నెట్టేంత వేగంగా మగాడు ముందుకొచ్చేస్తున్నాడు. దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. గ్లామర్ మేనియా వెనుక.. అందమైన కేశాలివిగో అంటూ గార్నియర్‌కు జాన్ అబ్రహాం, చర్మ సౌందర్యానికి నివియా టాక్ వాడాలని అర్జున్ రామ్‌పాల్ వంటి బాలీవుడ్ నటులు ప్రకటనల సాక్షిగా చెప్పే మాటలకి ఆకర్షితులవుతున్న మగవాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో మగవాళ్లపై దృష్టి సారించాయి బ్రాండ్స్. ఐపీఎల్ సమయంలో మగవాళ్ల బ్యూటీ కాస్మెటిక్స్ గురించి గార్నియర్ రాజస్థాన్ రాయల్స్‌తో అసోసియేట్ అయింది. ‘ నిర్విరామంగా ఎండకి గురయ్యే పురుషుల చర్మంపై సూర్యుని నుండి వెలువడే యూవీ రేస్ తీవ్ర ప్రభావం చూపుతాయి. చక్కగా కనిపించడం మగవాళ్లకి అవసరం’- ఆ టీమ్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చిన్నితెరపై చేసే ఇలాంటి ప్రకటనలు మగవాళ్లను బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం బారులు తీరేలా చేస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న ఆదాయాలు కూడా ఒక కారణం. కార్పొరేట్ కంపెనీలు సిబ్బంది లుక్స్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దీంతో అందంగా, హుందాగా కనపడడం ఇప్పుడు పురుషులకు తప్పనిసరైంది. విభిన్న నేపధ్యాల నుంచి ఐటీ రంగంలోకి ఎంటరయ్యే పురుషుల్లో అందంపై స్పృహ పెంచడానికి ప్రత్యేకంగా సిటీలోని ఐటీ కంపెనీలు గ్రూమింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాయి. బెస్ట్ డ్రెస్డ్ ఎంప్లాయ్ ఆఫ్ ది వీక్ వంటి అవార్డ్స్‌తో మగవాళ్లలో సెల్ఫ్లుక్పై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. చక్కగా పనిచేయడం మాత్రమే కాదు చక్కగా కనపడడమూ అంతే ముఖ్యమని పలు సంస్థలు స్పష్టం చేస్తుండడం కూడా వీరిపై ప్రభావం చూపిస్తోంది. రియాలిటీ టీవీ షోస్, ఫ్యాషన్ షోస్‌లో మేల్ మోడల్స్‌కు డిమాండ్ పెరగడం, పురుషులకు ప్రత్యేకించిన బ్యూటీ కాంటెస్ట్‌లు దీనికి దోహదం చేస్తున్నాయి. ఈ విషయంలో ముంబయి, బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా తర్వాత హైదరాబాద్ ముందంజలో ఉన్నాయి. పార్లర్స్‌లో పార్ట్‌టైమ్... వారాంతాల నుంచి దాదాపు రోజూ పార్లర్‌కు వెళ్లే మగవాళ్లు కూడా సిటీలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రోజువారీ మీటింగ్‌లు, పార్టీస్‌కి అటెండవ్వాల్సి రావడం వంటి అవసరాలతో డైలీ గ్రూమింగ్ రొటీన్‌కు పురుషులు అలవాటు పడుతున్నారు. ‘హెయిర్‌స్టైల్‌ని సెట్ చేసుకోవడం, షేవింగ్‌ల కోసం రోజూ మా సెలూన్‌కి వచ్చి మినిమం థర్టీ మినిట్స్ నుంచి వన్ హవర్ స్పెండ్ చేసే మగవాళ్లకి కొదవలేదు’ అని బంజారాహిల్స్‌లోని మేనియా సెలూన్ నిర్వాహకులు సచిన్ అంటున్నారు. పురుషులకు ఉపకరించే స్కిన్ లెటైనింగ్, హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ పార్లర్స్‌లో తప్పనిసరి ఉంచాల్సిన ఉత్పత్తులుగా మారాయి. క్రీమ్స్, లోషన్స్, ఫేస్ స్కర్బ్స్, షవర్ జెల్స్ వంటివి వాడకానికి సిటీ మగాళ్లు గతంలోలా సిగ్గుపడడం లేదు. దేశంలోనే మొత్తం స్కిన్ క్రీమ్ ఉత్పత్తుల మార్కెట్ 27 శాతం కాగా మేల్ స్కిన్ క్రీమ్ 41శాతంతో అత్యంత వేగంగా పెరుగుతోంది. ‘మేల్ స్కిన్ కేర్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్‌లో ఒకటి. ఎక్సర్సైజ్, ఈటింగ్ రైట్లతో పాటుగా గ్రూమింగ్ రొటీన్ కూడా పురుషుల దినచర్యలో భాగమైంది’ అని ది బాడీషాప్ ఇండియా సీనియర్ మేనేజర్ సంజాలి గిరి అంటున్నారు. షాపింగ్‌కు సై... బ్యూటీ గ్రూమింగ్ మీద పెరిగిన ఆసక్తి సిటీ మగవాళ్లలో కొత్తగా షాపింగ్ సరదాను ప్రేరేపిస్తోందని ఓ కంపెనీ చేసిన స్టడీ వెల్లడించింది. ఈ కారణంగా గత దశాబ్ద కాలంలో సిటీ మగవాళ్లలో షాపింగ్ సరదా కూడా పెరిగింది. ముఖ్యంగా 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్కులైన మగవాళ్లు గ్రూమింగ్ మీద ఆడవాళ్ల కన్నా బాగా ఖర్చు పెడుతున్నారట. ఐటిసి లిమిటెడ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్‌కు చెందిన బిజినెస్ హెడ్ నిరంజన్ ముఖర్జీ చెప్పిన ప్రకారం.. ‘మగవాళ్లు తమకు మాత్రమే ప్రత్యేకించిన ఉత్పత్తుల కోసం ఇన్నోవేటివ్ గ్రూమింగ్ కోసం చూస్తున్నారు’’.అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (అసోచామ్) చేసిన సర్వే ప్రకారం.. ఈ విషయంలో మహిళల కన్నా పురుషులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇదే సర్వే చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... 85 శాతం మంది తమ గ్రూమింగ్ ప్రొడక్ట్స్‌ను ఇంటి అవసరాలతో, భార్యల కొనుగోళ్లతో సంబంధం లేకుండా విడిగా కొనుగోలు చేస్తున్నారట. మార్కెట్ విస్తృతికి ఇది దోహదం చేస్తోందని అసోచామ్ ప్రతినిధులు అంటున్నారు. వెటైనింగ్- ఫెయిర్‌నెస్ అంశాల్లో ఎదుగుతున్న పట్టణాలకు చెందిన పురుషులు ఆసక్తి చూపుతున్నారు అని నివియా ఇండియా రక్షిత్ హర్గావె అంటున్నారు. షేవింగ్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, ఫేస్ మాస్క్స్, ఎక్స్ఫొలయేటర్స్, హెయిర్‌కేర్, హెయిర్ స్టైలింగ్ సొల్యూషన్స్ వంటి వి పురుషుల ఎంపికగా మారుతున్నాయి. బాత్, షవర్ జెల్స్, ఫేస్ వాష్, డియోడరెంట్స్... తదితర అవసరమైన బాతింగ్ ఉత్పత్తులు తమకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారని అసోచామ్ సర్వే వెల్లడించింది. -
న్యూస్ x సర్వేలో వైఎస్సాఆర్ సీపీదే హవా
-
నీల్సన్ సర్వే నిజమవుతుంది
ఉత్తరావల్లి (మెరకముడిదాం),న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలపై నీల్సన్ చేపట్టిన సర్వే నిజమవుతుంది, అత్యధిక స్థానాలను వైఎస్సా ర్ సీపీ గెలుచుకోవడం ఖాయమని ఆ పార్టీ వి జయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బేబీనాయన అన్నారు. బుధవారం ఆయన ఉత్తరావల్లిలో పార్టీ ముఖ్య నాయకు లు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. ముం దుగా పార్టీ ఆవిర్భవించి మూడేళ్లు పూర్తి కావడంతో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి బేబీనాయన, వరహాలనాయుడు పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంత రం బేబీనాయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తున్నారన్నా రు. జిల్లాలో ఎనిమిది మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని బాబు చెబుతున్నారని, జిల్లాకు ఒకటి, రెండు ఎమ్మెల్సీలు రావడమే కష్టమైతే ఆయన అంతమందికి ఎలా పదవులు ఇవ్వగలరని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం టీడీపీలో చేరుతున్న వారంతా ముందు వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వారేనని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాల న్నారు. చీపురుపల్లి సమన్వయకర్త మీసాల వరహాల నాయుడు మాట్లాడుతూ మండలంలో పార్టీ బలంగా ఉందన్నా రు. ఎన్నికల్లో పార్టీ గెలుపు ఖా యమని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కరణం మురళి, శనపతి సిమ్మినాయుడు, తుమ్మగంటి సూరినాయుడు, పల్లేడ బంగారు రాజు, ఎస్. రామస్వామి, మన్నెపురి చిట్టి, సర్పంచ్ ఎం.సత్యనారాయణ, కొమ్ము శంకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీయే నంబర్‌వన్
-
జగన్‌కే పట్టంగట్టిన కోస్తాంధ్ర ప్రజలు