Sales boom
-
హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ జోరు కొనసాగించింది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే కొత్త ప్రాజెక్టుల్లో యూనిట్ల అమ్మకాలు ఇక్కడే ఎక్కువగా నమోదయ్యాయి. 2021లో హైదరాబాద్ మార్కెట్లో 25,410 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కాగా, అందులో 55 శాతం యూనిట్లు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లోనివే కావడం గమనార్హం. 2019లో 16,560 యూనిట్ల ఇళ్ల అమ్మకాలతో పోలిస్తే స్వీకరణ రేటు (మొత్తం విక్రయాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి) పెరిగింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ అనరాక్ ఈ మేరకు ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. దేశంలోని ఏడు నగరాల్లో 2021లో కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుల్లో 35 శాతం ఫ్లాట్స్ వెంటనే అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. బ్రాండెడ్ డెవలపర్ల నుంచి కొత్త ప్రాజెక్టులు రావడం, అదే సమయంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులకు డిమాండ్ ఏర్పడడం సానుకూలించినట్టు పేర్కొంది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు సంబంధించిన గణాంకాలకు ఇందులో చోటు కల్పించింది. నివేదికలోని వివరాలు.. ► ఏడు నగరాల్లో 2021లో 2.37 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇందులో 34 శాతం కొత్త ప్రాజెక్టుల్లోనివి ఉన్నాయి. మిగిలిన 66 శాతం యూనిట్లు అంతక్రితం సంవత్సరాల్లో ఆరంభించిన ప్రాజెక్టుల్లోనివి. ► అంతక్రితం 2020లో 7 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 1.38 లక్షలుగా ఉంటే, అందులో కొత్త ప్రాజెక్టులకు సంబంధించినవి 28 శాతం. ► 2019లో అమ్ముడైన 2.61 లక్షల యూనిట్లలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన యూనిట్లు 26 శాతంగా ఉన్నాయి. ► చాలా కాలం తర్వాత కొత్తగా మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది. రెడీ టు మూవ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణంగా అనరాక్ పేర్కొంది. ► అయితే ఇప్పటికీ త్వరలో నిర్మాణం పూర్తయ్యే వాటికి, వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న వాటిల్లోనే ఎక్కువ కొనుగోళ్లు నమోదవుతున్నాయి. ► ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాల పరంగా తక్కువ రేటును చూపించింది. 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోతే, అందులో కొత్త ప్రాజెక్టుల్లోనివి 26 శాతంగానే ఉన్నాయి. ► బెంగళూరులో 2021లో 33,080 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో కొత్త ప్రాజెక్టుల్లోని యూనిట్ల అమ్మకాలు 35 శాతం. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో కొత్త ప్రాజెక్టుల్లోని విక్రయాలు మొత్తం విక్రయాల్లో 30 శాతంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో 25 % డౌన్ : నైట్‌ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 25 శాతం తగ్గినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 5,146 యూనిట్లు అమ్ముడుపోయాయని వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ గణాంకాలను తన నివేదికలో విడుదల చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండో పర్యాయం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వల్ల ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టినట్టు విశ్లేషించింది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడం రూ.25 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లపై ఎక్కువ ప్రభావం చూపించినట్టు తెలిపింది. ఈ విభాగంలో కేవలం 844 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని నివేదికలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఇదే విభాగంలో 2,888 యూనిట్లకు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తు చేసింది. 2022 ఫిబ్రవరిలో నాలుగు జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లను పరిశీలించగా.. హైదరాబాద్ జిల్లా పరిధిలో క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూస్తే 64 శాతం క్షీణించాయని తెలిపింది. కానీ, సగటు రిజిస్ట్రేషన్ విలువలో మాత్రం 21 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘గడిచిన కొన్నేళ్లలో విక్రయ ధరల వృద్ధి పరంగా హైదరాబాద్ దేశంలోనే బలమైన ఇళ్ల మార్కెట్‌గా ఉంది. 2022 మొదటి రెండు నెలల్లో రిజిస్ట్రేషన్లు తగ్గముఖం పట్టాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వ్యయాలు పెగడం, వైరస్ కారణంగా ఏర్పడిన నిర్వహణ సమస్యలే ఇందుకు కారణం’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. -
భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..!
భారత ఆటోమొబైల్ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా కియామోటార్స్ నిలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు సవాల్‌ను విసురుతోంది. 2021గాను కియా మోటార్స్ అనూహ్యమైన అమ్మకాలను భారత్‌లో జరిపింది. అమ్మకాల్లో 29 శాతం వృద్ధి..! కియా మోటార్స్ 2021గాను మొత్తంగా 2,27,844 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయంగా 1,81,583 యూనిట్లను కియా సేల్ చేసింది. సరఫరా, చిప్స్ కొరత ఉన్నప్పటికీ 2020తో పోలిస్తే 2021 దేశీయ విక్రయాలలో 29శాతం వృద్ధిని కియా మోటార్స్ నమోదు చేసింది. 2021గాను భారత మార్కెట్లో 6 శాతం మార్కెట్ వాటాను కియా మోటార్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో భారత్‌లోని మొదటి ఐదు కార్ల సంస్థల్లో కియా నిలిచింది. డిసెంబర్లో అదరగొట్టిన సెల్టోస్..! 2021 డిసెంబర్లో కియా మోటార్స్‌లో సెల్టోస్ కార్లు అత్యధికంగా అమ్ముడైనాయి. గత నెలలో కియా మోటార్స్ 7,797 యూనిట్ల అమ్మకాలను జరిపింది.వీటిలో సెల్టోస్ 4,012 యూనిట్లతో అగ్ర భాగంలో నిలిచాయి. సోనెట్ మోడల్స్ 3,578 యూనిట్లు, కార్నివాల్ 207 యూనిట్లను కియా మోటార్స్ విక్రయించింది. ఎగుమతుల్లో కమాల్..! భారత్‌లో కియా మోటార్స్‌ను స్థాపించినప్పటి నుంచి సుమారు 96,242 యూనిట్లను ఇతర దేశాలకు కంపెనీ ఎగుమతి చేసింది. 2021గాను 46,261 యూనిట్లను ఇతరదేశాలకు పంపిణీ చేసింది. 2020తో పోలిస్తే 2021లో ఎగుమతుల్లో 23 శాతం వృద్ధిని కియా సాధించింది. భారత్ నుంచి సుమారు 90 దేశాలకు కార్లను ఎగుమతి చేసింది. సెల్టోస్ రెండు లక్షలు..,సెనోట్ ఒక లక్ష..! ఇప్పటివరకు కియా మోటార్స్ సుమారు 2 లక్షలకు పైగా సెల్టోస్ మోడళ్లను, ఒక లక్షకు పైగా సోనెట్ వాహనాలను కంపెనీ విక్రయించింది. చదవండి: హ్యుందాయ్‌కు గట్టి షాకిచ్చిన టాటా మోటార్స్..! -
ధన్‌తేరస్‌కు గృహోపకరణాల జోరు
న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌కు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ధన త్రయోదశికి విక్రయాలు 45 శాతం దాకా పెరిగాయని కంపెనీలు అంటున్నాయి. భారీ తెర గల టీవీలు, ప్రీమియం ఉత్పత్తులతో ఈ పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరతతోపాటు నిరంతర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీలు సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. ‘ఈ పండుగల సీజన్లో కస్టమర్ల సెంటిమెంట్ ఆల్–టైమ్ హైలో ఉంది. మహమ్మారి తర్వాత బలంగా ఉద్భవించిన ఈ–కామర్స్ రంగం గ్రామీణ, చిన్న మార్కెట్లలో బ్రాండ్లు చొచ్చుకుపోవడానికి సహాయపడుతోంది’ అని కంపెనీలు చెబుతున్నాయి. ఓనమ్, దసరాతో మొదలైన కొనుగోళ్ల జోరు దీపావళి వరకు కొనసాగుతుందని పరిశ్రమ ఆశగా ఉంది. ఏడాదిలో జరిగే మొత్తం అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా 30 శాతం దాకా ఉంది. ప్రీమియం టెలివిజన్లకు.. ఈ ధన్‌తేరస్‌కు పెద్ద తెర గల ప్రీమియం టెలివిజన్లకు మంచి డిమాండ్ ఉందని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. ప్రధానంగా 55 అంగుళాలు, ఆపైన సైజు టీవీలకు అద్భుత స్పందన ఉందన్నారు. అన్ని రకాల సౌండ్ బార్స్ సైతం అమ్ముడయ్యాయని చెప్పారు. కిత్రం ఏడాదితో పోలిస్తే ఈ ధంతేరస్‌కు 30–35 శాతం అధిక వ్యాపారం చేశామన్నారు. ఫెస్టివల్ సీజన్ అయ్యేంత వరకు ఈ జోష్ ఉంటుందన్నారు. 2020తో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని ప్యానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా సీఈవో మనీశ్ శర్మ తెలిపారు. పండుగల సీజన్ పూర్తి అయ్యేసరికి 50 శాతం అధిక విక్రయాలు నమోదు చేస్తామన్నారు. స్మార్ట్ 4కే ఆన్‌డ్రాయిడ్ టీవీలు, స్మార్ట్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ ఈ వృద్ధిని నడిపిస్తున్నాయని వివరించారు. బలంగా సెంటిమెంట్.. పండుగ సీజన్ పూర్తి అయ్యేనాటికి వృద్ధి మరింతగా ఉంటుందని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. కొనుగోళ్ల విషయంలో కస్టమర్ల సెంటిమెంట్ బలంగా ఉందని శామ్సంగ్ చెబుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది ధంతేరస్‌కు 20 శాతం అధికంగా అమ్మకాలు సాధించామని శాంసంగ్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఎస్వీపీ రాజు పుల్లన్ వెల్లడించారు. ఓఎల్ఈడీ టీవీ, అల్ట్రా హెచ్డీ టీవీ, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్, చార్కోల్ మైక్రోవేవ్స్ వంటి ఉత్పత్తులకు స్థిరమైన వృద్ధి చూస్తున్నామని ఎల్జీ ఇండియా కార్పొరేట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ తెలిపారు. గోద్రెజ్ అప్లయాన్సెస్ 45 శాతం వృద్ధి నమోదు చేసింది. 2019లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ భారత్‌లో సుమారు రూ.76,400 కోట్లు ఉంది. -
అమ్మకాల్లో దుమ్మురేపిన ఈ-కామర్స్ సంస్థలు..!
కోవిడ్-19 రాకతో పలు వ్యాపార సంస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. కోవిడ్-19 రాకతో ఫాస్ట్ మూవింగ్ కస్యూమర్ గూడ్స్(ఎఫ్ఎమ్సీజీ) కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు గణనీయంగా వృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస లాక్డౌన్లు పలు ఆన్లైన్ కిరాణా సంస్థలకు భారీ ప్రయోజనాన్నిచేకూర్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్ సంస్థలపై మొగ్గుచూపాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ-కామర్స్ సంస్థలు ద్వారా కిరాణా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ పరిశోధన సంస్థ నిల్సన్ఐక్యూ పేర్కొంది.కోవిడ్ రాక ముందు 2020 సంవత్సరంలో ఈ-కామర్స్ అమ్మకాలు 96 శాతంగా ఉండగా కోవిడ్ రాకతో 134 శాతానికి గణనీయంగా అమ్మకాలు వృద్ధి చెందాయి. దీంతో మే నెలలో ఈ-కామర్స్ సంస్థలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 52 మెట్రో నగరాల్లో ఎఫ్ఎంసిజి అమ్మకాలు ఈ-కామర్స్ సహకారంతో 2021 మే నెలలో రెండంకెల మార్కును వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్ఎమ్సీజీ కంపెనీల వృద్ధి కొనసాగుతూనే ఉందని నీల్సన్ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సమీర్ శుక్లా వెల్లడించారు. వినియోగదారుల ఆకాంక్షలను పూర్తి చేయడంలో ఎఫ్ఎమ్సీజీ కంపెనీలకు ఈ-కామర్స్ కంపెనీలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ-కామర్స్ సంస్థల సహయంతో ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ కంపెనీల సేల్స్‌లో మారికో లిమిటెడ్ 9 శాతం, హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ 6 శాతంగా వృద్ధి చెందాయి. కాగా మరోవైపు గ్రాసరీ స్టోర్ల పరిస్థితి దయానీయంగా మారింది. ప్రజలు ఎక్కువగా గ్రాసరీ స్టోర్లవైపు కాకుండా ఈ-కామర్స్ సంస్థల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని నిల్సన్ఐక్యూ పేర్కొంది. -
ఆల్న్యూ క్రెటా అమ్మకాల జోరు
సాక్షి, ముంబై: గడిచిన ఏడాది కాలంలో తన పాపులర్ ఎస్యూవీ ఆల్-న్యూ ‘క్రెటా’ వాహనాలు 1.21 లక్షలు అమ్ముడైనట్లు హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తెలిపింది. సరికొత్త వెర్షన్లో ఆల్–న్యూ క్రెటా కిందటేడాది మార్చిలో విడుదలైంది. ఈ మోడల్ దేశంలో కంపెనీ ఎస్యూవీ విభాగానికి తలమానికంగా నిలిచింది. భారత ఆటో పరిశ్రమలో ఒక ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఆల్-న్యూ క్రెటా రికార్డును నమోదు చేసినట్లు హ్యుందాయ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. మన్నికైన తయారీ, ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన మోడళ్లను కస్టమర్లు ఎల్లప్పుడూ ఆదరిస్తారనేందుకు క్రెటా విక్రయాలే నిదర్శనమని గార్గ్ పేర్కొన్నారు. ఇక 2015 జూలైలో విడుదలైన క్రెటా కార్ల అమ్మకాలు ఇప్పటి వరకు భారత్‌లో 5.8 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 2.16 లక్షలకు చేరుకున్నాయి. -
రెడ్మి ఫోన్ల సునామీ; 90సెకన్లలో నో స్టాక్
సాక్షి, న్యూఢిల్లీ: షియోమి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ఫోన్లు 90 సెకన్లలోనే అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. గత వారమే ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ రోజు అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఫస్ట్‌సేల్‌లో ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదనపు ఆకర్షణలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అమెజాన్‌తో పాటు ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం, ఎం స్టూడియో స్టోర్లలోనూ ఈ ఫోన్ కొనుగోళ్ల సునామీ సృష్టించింది. దీంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోసేల్‌ను ఈ నెల 24న నిర్వహించనున్నట్టు షియోమీ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు. అమెజాన్‌లో ఈ ఫోన్లు విక్రయానికి పెట్టిన 90 సెకన్లలోనే అమ్ముడుపోయినట్టు మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 6జీబీ,128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్లో భాగంగా హెచ్డీఎప్సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. ఎయిర్టెల్ రూ.298, రూ.398 అన్లిమిటెడ్ ప్యాక్‌లపై డబుల్ డేటా వంటి ప్రయోజనాలను సైతం అందిస్తోంది. రెడ్మి నోట్ 9 ప్రొ ఫీచర్లు ఈ విధంగా.. - 6.67 అంగుళాల ఫుల్ హెడ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే - 48 ఎంపీ ప్రధాన సెన్సార్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనక నాలుగు కెమెరాలు - ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ - 512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం - 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
సంస్కరణలపై అనిశ్చితితో నష్టాలు
చివర్లో అమ్మకాల వెల్లువ - సెన్సెక్స్ శ్రేణి.. ప్లస్ 182 - మైనస్ 218 - చివరకు 135 పాయింట్ల నష్టంతో 28,102 వద్ద ముగింపు... - 39 పాయింట్లు క్షీణించి 8,526కు నిఫ్టీ ట్రేడింగ్ చివరి అరగంటలో అమ్మకాల వెల్లువ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. భూ సేకరణ, జీఎస్టీ బిల్లులు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశాల్లేవన్న ఆందోళనతో లాభాల స్వీకరణ జరిగి అమ్మకాలు పోటెత్తాయి. దీంతో అప్పటివరకూ లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల పాలయ్యాయి. బీఎస్ఈ సెనెక్స్ 135 పాయింట్లు క్షీణించి 28,102 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 8,526 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే ఒక రోజు అత్యధిక పతనం. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జరపడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం కూడా ప్రభావం చూపాయి. ఆయిల్, ఎఫ్ఎంసీజీ, కొన్ని టెక్నాలజీ, వాహన షేర్లు నష్టపోయాయి. తీవ్ర ఒడిదుడుకులు..: సెన్సెక్స్ 28,251 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దిగుమతుల బిల్లు తగ్గగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో సూచీలు లాభాల్లోనే సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 28,419 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 182 పాయింట్లు లాభపడింది) గరిష్ట స్థాయిని తాకింది. అమ్మకాల వెల్లువ కారణంగా 28,018 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 218 పాయింట్లు నష్టం)కు పడిపోయింది. 20 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,529 షేర్లు నష్టాల్లో, 1,424 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,105 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,379 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,78,752 కోట్లుగా నమోదైంది.