![New Hyundai Creta sells over 1.21 lakh units in one year - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/17/New%20Hyundai%20Creta.jpg.webp?itok=66qDZ6w5)
సాక్షి, ముంబై: గడిచిన ఏడాది కాలంలో తన పాపులర్ ఎస్‌యూవీ ఆల్-న్యూ ‘క్రెటా’ వాహనాలు 1.21 లక్షలు అమ్ముడైనట్లు హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ తెలిపింది. సరికొత్త వెర్షన్‌లో ఆల్–న్యూ క్రెటా కిందటేడాది మార్చిలో విడుదలైంది. ఈ మోడల్ దేశంలో కంపెనీ ఎస్‌యూవీ విభాగానికి తలమానికంగా నిలిచింది. భారత ఆటో పరిశ్రమలో ఒక ఏడాదిలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా ఆల్-న్యూ క్రెటా రికార్డును నమోదు చేసినట్లు హ్యుందాయ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. మన్నికైన తయారీ, ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగిన మోడళ్లను కస్టమర్లు ఎల్లప్పుడూ ఆదరిస్తారనేందుకు క్రెటా విక్రయాలే నిదర్శనమని గార్గ్ పేర్కొన్నారు. ఇక 2015 జూలైలో విడుదలైన క్రెటా కార్ల అమ్మకాలు ఇప్పటి వరకు భారత్‌లో 5.8 లక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో 2.16 లక్షలకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment