
సోషల్ కామర్స్ యునికార్న్ మీషో పండుగ సీజన్ నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు 'మహా ఇండియన్ షాపింగ్ లీగ్' పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఇప్పటికే లక్షకు పైగా కొత్త విక్రేతలను ఆన్ బోర్డ్ చేసినట్లు తెలిపింది, టైర్-2 నగరాల్లోని వినియోగదారుల నుంచి గతంతో పోలిస్తే 3 రేట్లు ఎక్కువ రోజువారీ ఆర్డర్లను ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మీషో ఫ్లాగ్ షిప్ సేల్ సందర్భంగా ఇందులో పాల్గొనే వినియోగదారులకు రూ.20 కోట్ల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది.
ప్రతి గంటకు వినియోగదారులు ఒక ప్రీమియం కారు, రూ.1కోటి నగదు రివార్డులు, రూ.15 కోట్ల విలువైన మీషో క్రెడిట్లు, బంగారు నాణేలు, రూ.2 కోట్లకు పైగా విలువైన ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని టైర్-2 నగరాల నుంచి భారీగా ఆన్ లైన్ షాపింగ్ కు డిమాండ్ రావడంతో ఆ ప్రాంతాల్లోని వినియోగదారులకు చేరువ కావడం కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టినట్లు మీషో పేర్కొంది. 'మీషో' కామర్స్ సప్లయర్స్, రీసెల్లర్స్, కస్టమర్స్ అనే విభాగాలుగా నడుస్తోంది. ఇందులో నమోదైన రీసెలర్లు సరఫరా దారుల నుంచి అన్ బ్రాండెడ్ ఫ్యాషన్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటికి బ్రాండింగ్ ఇచ్చి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా విక్రయిస్తారు.(చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్!)
సోషల్ మీడియా ద్వారానే కాకుండా నేరుగానూ మీషో భారీగా విక్రయాలు చేపట్టి ఫేస్‌బుక్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా మారింది. క్రీడలు, క్రీడా సామగ్రి, ఫిట్‌నెస్, పెట్ సప్లైయిస్, ఆటోమోటివ్ పరికారాలనూ మీషో విక్రయిస్తుండటం గమనార్హం. ఇందులో చాలా తక్కువ ధరకు ఉత్పత్తుల దొరకడంతో చాలా మందికి చేరువ అయ్యింది. ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా ఈ సోషల్ కామర్స్ ఎదుగుతోంది. దాంతో 2022 డిసెంబర్ నాటికి నెలకు వంద మిలియన్ల లావాదేవీలు చేసే వినియోగదారులను సంపాదించుకోవాలని భావిస్తోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్ టాలెంట్ తదితర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2021, సెప్టెంబర్ 27 నాటికే మీషో భారత్‌లో అతిపెద్ద సోషల్ కామర్స్ వేదికగా ఆవిర్భవించింది. 1.3 కోట్ల రీసెల్లర్స్, 4.5 కోట్ల వినియోగదారులు, లక్షకు పైగా సరఫరా దారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment