న్యూఢిల్లీ: విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకు కఠిన నిబంధనలు అమలు చేయాలని రిటైలర్లతో కూడిన వాణిజ్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరాయి. ఈ-కామర్స్ కంపెనీలు పెద్ద ఎత్తున విక్రేతలను చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపాయి. మొత్తం అమ్మకాల్లో అయిదారుగురు విక్రేతల వాటాయే 95 శాతముంటుందని వెల్లడించాయి.
అమ్మకాలు జరుగుతున్న తీరుకు సంబంధించిన సమాచారాన్ని తమకు నచ్చిన విక్రేతలకు చేరవేయడంతోపాటు ప్రైవేట్ లేబుల్స్‌ను ప్రవేశపెట్టి లబ్ది పొందుతున్నాయని వివరించాయి. ఆల్ ఇండియా ఆన్‌లైన్ వెండార్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్, ఎఫ్‌ఎంసీజీ డిస్ట్రీబ్యూటర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు అసంభవ్ పేరుతో సమావేశం జరిపాయి. అయితే ఏప్రిల్ 15-18 తేదీల్లో అమెజాన్ సంభవ్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment