![Jio GroupTalk Conference Calling App Launched for Android Users - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/22/Jio.jpg.webp?itok=ODJo3dnG)
సాక్షి, న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ యూజర్లకోసం రిలయన్స్ జియో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గ్రూపు కాలింగ్ లేదా గ్రూపు టాక్ అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకు కోసం గూగుల్ యాప్ స్టోర్‌లో ఒక కొత్త అప్లికేషన్‌ను అందిస్తోంది. దీని ప్రకారం జియో సిమ్ వాడుతున్న ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్ కాల్ (ఆడియో మాత్రమే) ద్వారా మాట్లాడుకోవచ్చు. ఇందులో లెక్చర్ మోడ్, మ్యూట్ పార్టిసిపెంట్ లాంటి ఇతర ఫీచర్లను కూడా జోడించింది. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ యాప్‌ను అతి త్వరలోనే జియో కస్టమర్లకు అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment