న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాన్ని కనిపెట్టిన ఢిల్లీ టెకీకి యాపిల్ సంస్థ సుమారుగా రూ. 75 లక్షల నజరానా ప్రకటించింది. ఐఓస్ 13లో యాపిల్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యే ఆప్షన్‌ను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే సరైన ఐడీ లేకుండానే యాపిల్ మొబైల్‌లో వాడే వెసులుబాటు కల్పించే ఓ లోపాన్ని ఢిల్లీకి చెందిన భావుక్ జైన్ కనిపెట్టి యాపిల్ సంస్థకు తెలిపారు. దీంతో వెంటనే ఆ లోపాన్ని యాపిల్ సంస్థ సరిచేసింది. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తామని యాపిల్ చెప్పినట్లు వెల్లడించారు. భావుక్ జైన్ గతంలో ఫేస్‌బుక్, యాహూ, గూగుల్, గ్రాబ్ వంటి వాటిల్లో సైతం లోపాలను కనిపెట్టి వారికి తెలియజేశారు. (ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఎంతంటే..?)
జూమ్ యాప్‌లో ఎన్క్రిప్షన్ అప్‌డేట్
న్యూఢిల్లీ: ప్రముఖ వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ ఫాం జూమ్ తమ యాప్‌నకు తాజా అప్‌డేట్ ఇచ్చింది. ఈ అప్‌డేట్‌లో వినియోగదారులకు మరింత భద్రత, వ్యక్తిగత విషయాల్లో గోప్యతతో పాటు ఏఈఎస్ 256 బిట్ జీసీఎం ఎన్క్రిప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీనివల్ల ఇతరులకు వినియోగదారుల సమాచారం దక్కదని చెప్పింది. ఈ సదుపాయాలను పొందేందుకు జూమ్ 5.0కు వినియోగదారులు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment