ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఓఎస్ 18.1ని విడుదల చేసింది. వినియోగదారులకు మరింత సేవలందిచేలా, యూజర్లను ఆకట్టుకునే కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా గతంలో ఐఓఎస్ వర్షన్‌లో లేని కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను కొత్త ఓఎస్‌లో ప్రవేశపెట్టింది. దాంతోపాటు యాపిల్ ఇంటెలిజెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఫోన్ వినియోగదారులు గతంలో తమ కాల్స్‌ను రికార్ట్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఓఎస్ 18.1లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ రికార్డ్ చేసిన కాల్ డేటాను రియల్‌టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్ ద్వారా టెక్స్ట్ ఫార్మాట్‌లో అందించేందుకు వీలుగా యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అంటే మీరు ఫోన్‌లో మాట్లాడే మాటలు రికార్డ్ అవ్వడంతోపాటు మీ కన్వర్జేషన్ మొత్తం టెక్స్ట్ ఫార్మాట్‌లోకి మారుతుంది. అయితే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జాపనీస్, కొరియన్, ఫోర్చుగీస్, స్పానిష్..వంటి భాషల్లో అందుబాటులో ఉందని తెలిపింది.
మీ ఐఫోన్‌ల్లో కాల్స్ రికార్డ్ చేయడానికి ముందుగా డివైజ్ సెట్టింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఐఓఎస్ 18.1 వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐ పవర్డ్ టూల్స్ సూట్‌గా పని చేస్తోంది.
మెయిల్, మెసేజ్‌లు, నోట్స్ వంటి యాప్‌లలో సమగ్ర సమాచారాన్ని క్లుప్తంగా అందిస్తుంది.
మెయిళ్లు, మెసేజ్‌లకు సంక్షిప్తంగా యూజర్ అనుమతితో రిప్లై ఇస్తుంది.
ఏదైనా టెక్ట్స్, ఆర్టికల్ రాసేప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది. రైటింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.
గ్యాలరీ స్టోరేజీలో ప్రత్యేకమైన రోజుల్లో మీ ఫోటోలు, వీడియోలు కలెక్ట్ చేసి మెమోరీస్‌ను క్రియేట్ చేస్తుంది.
యాప్స్ వాడుతున్నప్పుడు ఇంటర్నల్‌గా ఎదురయ్యే ల్యాగ్‌ను తగ్గించేందుకు టూల్‌ను క్లిన్ చేస్తూంటుంది.
చాట్‌జీపీటీను ఇంటిగ్రేట్ చేస్తూ కావాల్సిన సమాచారం అందిస్తుంది.
ఇదీ చదవండి: మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!
ఐఓఎస్ 18.1 అన్ని ఐఫోన్ మోడళ్లలో సపోర్ట్ చేయదు. ఐఫోన్ 11, 12, 13, 14, 15, 16, ఎక్స్‌ఎస్, ఎక్స్‌ఆర్, ఎస్‌ఈ(2వ ఎడిషన్) డివైజ్‌ల్లో మాత్రమే వినియోగించవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను మాత్రం ఐఫోన్ 16 సిరీస్, 15 ప్రో సిరీస్, 14 ప్రో సిరీస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment